ఎంటర్‌టైన్‌మెంట్ త‌గ్గ‌కుండా మంచి సందేశంతో తెరకెక్కిన ‘ప్రతిరోజూపండగే’ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది – సుప్రీమ్ హీరో సాయితేజ్.

0
1088

`చిత్రలహరి’ లాంటి సూపర్ హిట్ తరువాత సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా, హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిన  “ప్రతిరోజూ పండగే” చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా “ప్రతిరోజూ పండగే” చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇంటర్వ్యూ..

ట్రైల‌ర్ చూస్తుంటే `శతమానంభవతి’సినిమాకి దగ్గ‌ర‌గా ఉందనిపిస్తోంది?
–  అలాంటిదేమీ లేదు. ఈ ప్రశ్న అడుగుతారనే ‘ట్రైలర్‌’లో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాం. ఇదొక తాత-మనవడి కథ. వాళ్లిద్దరి మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలు తదితర సన్నివేశాలతో ఈ కథ సాగుతుంది. ఒక తాత తన జీవితంలో ఏమేం కోల్పోయాడో అవన్నీత‌న చివరి రోజుల్లో తీర్చే మనవడి కథ.

‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ పెట్ట‌డానికి రీజ‌న్ ఏంటి?
–  ప్రతిరోజూ మనకు నచ్చిన పని చేసి మన వాళ్ళ‌తో మ‌నం ఉంటే ప్రతిరోజూ పండగే.

ఉమ్మడి కుటుంబ కథగా దీన్ని చెప్పవచ్చా?
– దాదాపు అలాగే ఉంటుంది. చాలా మంది తమ తల్లిదండ్రులను విడిచి అమెరికా, ఆస్ట్రేలియా వెళ్లిపోతుంటారు. అలాంటి వారందరి మనసులను తాకే సినిమా ఇది. చాలా సున్నితమైన కథ, దాన్ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ, ఎంటర్‌టైన్‌మెంట్ త‌గ్గ‌కుండా ఒక మంచి సందేశంతో దర్శకుడు మారుతి ఈ కథను రూపొందించారు.

మిమ్మల్ని బాగా టచ్‌ చేసిన పాయింట్ ఏంటి?
– క్యాన్స‌ర్ వ‌ల్ల ఐదు వారాల్లో తాతయ్య చనిపోతాడ‌ని తెలిసి త‌న చివ‌రి రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఒక మనవడు ఏం చేశాడన్న పాయింట్‌ బాగా నచ్చింది. రియ‌ల్ జీవితంలో కూడా ఇలాంటి వ్య‌క్తులు ఉన్నారు. దానికి నాగార్జున గారే ఉదాహ‌ర‌ణ‌. ఆయన తండ్రి చ‌నిపోతార‌ని తెలిసినా నాగేశ్వ‌ర రావు గారి
చివరి రోజుల్లో ఆయ‌న‌ను చాలా సంతోషంగా చూసుకున్నారు.

సినిమాలో క్యారెక్ట‌ర్ కోసం ఎలాంటి జాగ్ర‌త‌లు తీసుకున్నారు?
– మారుతి గారు ఈ కథ చెప్పగానే ఇందులోని పాత్రకు సిద్ధం కావడానికి రెండు నెలల సమయం అడిగా. `చిత్ర‌ల‌హ‌రి` టైమ్‌లో కాస్త లావయ్యాను. అందుక‌నే రెండు నెల‌లు స‌మ‌యం కావాల‌ని అడిగి వర్కవుట్‌ చేసి దాదాపు 20 కిలోల వ‌ర‌కూ బ‌రువు తగ్గాను.

ఒక తాతా మ‌న‌వ‌డి ఎమోష‌న్ కాకుండా ఇంకా సినిమాలో ఎలాంటి ఎమోషన్స్‌ ఉంటాయి?
– ఈ సినిమాలో ఉగాది పచ్చడిలా అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే పాత్రలే ఎక్కువ‌గా కనిపిస్తాయి.

మారుతీతో పరిచయం ఎలా ఏర్పడింది?
– నేను ఎంబీఏ చ‌దువుకునే రోజుల్లో మారుతి గారు  పరిచయం అయ్యారు. సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. అప్పుడే నన్ను కూర్చోబెట్టి కథలు చెప్పేవాడు. ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్లు వెళ్లాం. దాదాపు పదేళ్ల తర్వాత మాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.

మీకు ‘ప్రతిరోజూ పండగే’ అని ఎప్పుడు అనిపిస్తుంటుంది?
– మ‌నం చేసే ఏ ప‌నిలో అయినా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే త‌ప్ప‌కుండా ‘ప్రతిరోజూ పండగే . ఈ సినిమాలో ఒక డైనింగ్‌ టేబుల్‌ సీన్‌ ఉంటుంది. అది మా కుటుంబంలో జరిగినట్లు ఉంది. చిన్నప్పటి నుంచి ప్రతి ఆదివారం, పండగలకు చిరంజీవిగారి ఇంటికి వెళ్లి కలుస్తూ ఉంటాం. అందుకే ఆ రోజులన్నీ పండగల్లానే ఉంటాయి. నాకు ఈ సన్నివేశం బాగా కనెక్ట్‌ అయింది.

తమన్ సంగీతం గురించి ?
– తమన్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన కొన్ని సినిమాలు అంత‌గా ఆడకపోయినా, మ్యూజిక్‌ పరంగా మాత్రం మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం.

 కథ చిరంజీవి కూడా విన్నారని మారుతి చెప్పారు! మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
– చిరంజీవి గారికి ఈ కథ చాలా బాగా నచ్చింది. ‘నాకు చెప్పినట్లే సినిమా తీస్తారా, లేదా? అనేది కూడా చూస్తాను అని మావ‌య్య చెప్పారు.

‘చిత్రలహరి’లో మీ క్యారెక్ట‌ర్ చాలా సెటిల్డ్‌గా ఉంటుంది? దాని నుండి బ‌య‌ట‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టిందా?
– సినిమాలో ఆ పాత్రను సులభంగానే చేశా. కానీ, దాని నుంచి బయటకు రావడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మొదట్లో కూడా చాలా డల్‌గా కనిపించేవాడిని. నెమ్మదిగా తెలుసుకొని దాని నుంచి బయటకు వచ్చా.

కుటుంబ కథా చిత్రాలు చేయడం సులభమా? మాస్‌, కమర్షియల్‌ సినిమాలు చేయడమా?
– ఏ సినిమాకు ఉండే కష్టం దానికి ఉంటుంది. అందుకు తగినట్లే సిద్ధం కావాల్సి ఉంటుంది. ఒక సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుంది? ఎలాంటి దుస్తులు వేసుకుంటుంది? ఎలా ప్రవర్తిస్తుంది? ఇదంతా సవాల్‌తో కూడుకున్న విషయాలే. అందుకు సిద్ధం కావడానికి సమయం పడుతుంది.

సత్యరాజ్‌తో వ‌ర్క ఎక్స్‌పీరియ‌న్స్‌?
– సత్యరాజ్ గారు చాలా మంచి వ్యక్తి. ఎనర్జీతో పనిచేస్తారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆయనకు తెలుసు. అందరితోనూ నవ్వుతూ మాట్లాడతారు. సెట్‌లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు.

‘సోలో బతుకే సో బెటర్‌’ షూటింగ్‌ ఎంతవరకూ వచ్చింది?
– ప్రస్తుతానికి చిన్న షెడ్యూల్‌ మాత్రమే అయింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పూర్తి షూటింగ్‌ ప్రారంభిస్తాం.

వరుణ్‌తేజ్‌ కలిసి పనిచేసే అవకాశం ఉందా?
–  మంచి కథ కోసం వేచి చూస్తున్నాం. అలా వస్తే తప్పకుండా పనిచేస్తాం. రవితేజగారితో కూడా కలిసి పనిచేయాలని ఉంది. అప్పుడప్పుడు మేము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం

ఎవరైనా మొద‌టి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు క‌థ తీసుకొని మీ వద్దకు వస్తే ఎలా స్పందిస్తారు? 
– కొత్త దర్శకుడు సినిమా తీసి హిట్‌ కొట్టాడంటే అది చాలా పెద్ద విషయం. కథ రాసుకోవడం, హీరోతో ఒప్పించడం, సినిమా తీయడం ఇదంతా కష్టమైన విషయం. అలాగే సినిమాను సరైన సమయానికి విడుదల చేయడం కూడా కష్టం. సినిమా చేస్తానని మాట ఇవ్వను కానీ తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తాను.

‘ఉప్పెన’ లో వైష్ణవ్‌తేజ్‌కు ఏమైనా స‌ల‌హాలు ఇచ్చారా?
– వాడు నా కన్నా చాలా సీనియర్ ఆల్రెడీ ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’, ‘జానీ’, ‘అందరివాడు’ మూడు సినిమాలు చేశాడు. నన్ను సెట్స్ దగ్గ‌ర‌కు కూడా రావద్దన్నాడు.

పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా ?
– ఓకే అయిందా అండీ! మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు(నవ్వుతూ). నేను ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా. ఆయన మళ్లీ నటిస్తే చూడాలని ఉంది. ప్రస్తుతం టైమ్‌ బాంబ్‌ ఆన్‌ అయింది. ఎప్పుడు కన్మఫాం అయితే అప్పుడు ఆ బాంబు పేలుతుంది. అంటూ ఇంట‌ర్య్వూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here