జేమ్స్ బాండ్ 25 మూవీ : థ్రిల్లింగ్ యాక్షన్, ఛేజింగ్ సీన్స్ తో అదరగొట్టిన ‘నో టైం టు డై’ ట్రైలర్….!!

0
758

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్ లోని 25వ సినిమాగా తెరకెక్కుతున్న ‘నో టైం టు డై’ ట్రైలర్ కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయింది. గత సినిమాల మాదిరిగానే మంచి థ్రిల్లింగ్ యాక్షన్ మరియు ఛేజింగ్ సెన్స్, గ్రాండియర్ గా అదిరిపోయే విజువల్స్ తో ఈ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని చెప్పాలి. డానియల్ క్రెయిగ్ ఈ సినిమాలో బాండ్ పాత్రలో కనిపిస్తారు. ఇదివరకు క్యాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలేస్, స్కై ఫాల్, స్పెక్ట్రీ సినిమాల్లో కూడా ఆయన బాండ్ పాత్రలో నటించి మెప్పించారు.

మైఖేల్ జి విల్సన్, బార్బరా బ్రొకోలి నిర్మాతలుగా మెట్రో గోల్డ్ విన్ మేయర్ ఇయాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్యారీ జోజి ఫ్యూకునాగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా బాండ్ లవర్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఎంతో ఆకట్టుకుంటుందని అర్ధం అవుతోంది. రమి మాలెక్, రాల్ఫ్ ఫెన్నెస్, నయోమి హారిస్, రోరి కిన్నియెర్, లియా సెడౌక్స్ తదితరులు సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి సినిమాను 2020 ఏప్రిల్ లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here