రియల్ రీల్స్ ఆర్ట్స్, అమృత హరిణి క్రియేషన్స్, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ పతాకం పై పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా ఎస్ ఎస్ మురళి కృష్ణ దర్శకతంలో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రి సౌండ్ ‘. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాప్ నివ్వగా ఇటీవల ‘సైరా’ సినిమాతో విజయ కెరటం ఎగరవేసిన దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్ చేశారు. పోసాని కృష్ణ మురళి గౌరవ దర్శకత్వం వహించారు. ‘రొమాంటిక్’ హీరో ఆకాష్ పూరి పూజ కార్యక్రమాలలో పాల్గున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ – ” హీరో సాయిరామ్ శంకర్ ‘రీసౌండ్’ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ – “ఆర్య’ సినిమాతో సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేశారు. ఇప్పుడు ‘రంగస్థలం’తో రీసౌండ్ చేశారు, అలాగే ‘అతడొక్కడే’ చిత్రంతో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేశారు మళ్ళీ ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి’సైరా’తో రీసౌండ్ చేశారు. మా సినిమా పేరు ‘రీసౌండ్’ మంచి కథ, కొత్తగా ఉంటుంది. రేపటి నుంచే షూటింగ్ ప్రారంభం. హైదరాబాద్, వైజాగ్ లో షూటింగ్ చేయబోతున్నాం. అన్ని కమర్షియల్ ఉండే సినిమా. తప్పకుండా అందరిని అలరిస్తామనే నమ్మకం ఉంది. మా సినిమా ప్రారంభానికి వచ్చిన సుకుమార్ గారికి సురేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు” అన్నారు
హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ : ”నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయి రామ్ శంకర్ గారికి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్” అని తెలిపారు.
డైరెక్టర్ ఎస్ ఎస్ మురళి కృష్ణ మాట్లాడుతూ : “మంచి కమర్షియల్ సినిమా. అందరికి సినిమా నచ్చుతుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం”అన్నారు.
నిర్మాతలు రాజా రెడ్డి మాట్లాడుతూ “రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. సాయి రామ్ శంకర్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. సుకుమార్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి మా సినిమా ఫంక్షన్ కి వచ్చినందుకు ధన్యవాదాలు. మంచి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది” అన్నారు.
సినిమా పేరు : రీసౌండ్
నటి నటులు : సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద కృష్ణ, తదితరులు
కెమెరా మాన్ : సాయి ప్రకాష్
సంగీతం : స్వీకర్ అగస్తి
డైరెక్టర్ : ఎస్ ఎస్ మురళి కృష్ణ.
నిర్మాతలు : జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి


