‘ప్రతి రోజు పండగే` షూటింగ్ పూర్తి డిసెంబర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌!!

0
1266

సుప్రీం హీరో సాయి తేజ్ హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లోఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” డిసెంబర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – “గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి గతంలో ‘భలే భలే మొగాడివోయ్’ సినిమా తీశాం. అది బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. దాని తర్వాత మళ్ళీ అదే టీమ్ కలిసి చేస్తోన్న చిత్రం ‘ప్రతి రోజు పండగే’. దర్శకుడు మారుతికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఒక సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా తీసుకెళ్లి తెలియకుండా మంచి మెస్సేజ్‌ని మనలో ఎక్కించే నేర్పరి తనం. అది ఉండే బహుకొద్ది మందిలో మారుతి ప్రధమ శ్రేణిలో ఉంటారు. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎన్ఆర్ఐ గురించి చెప్పిన స్టోరీ. ఇక్కడ ఉన్న వారితో కనెక్ట్  కాకుండాఎలాఇబ్బందిపడుతు న్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా కాలం నుండి సాయితో సినిమా చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. అలాగే రాశితో కూడా..రాశి ఏంజెలా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తనతో 2020లో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ” భలే భలే మొగాడివోయ్ చిత్రంతో ఈ రెండు బేనర్స్ ని కలిపాను. అరవింద్ గారి ప్రొడక్షన్ లో సినిమా తీస్తున్నప్పుడు ప్రతి షాట్‌కి ఇది అరవింద్ గారి సినిమా వొళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి అనే భాద్యత అరవింద్ గారు మాకు కనపడక పోయినా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్‌ మాత్రం అందరిలో ఉంటుంది. నాకు వ‌చ్చిన ఒక థాట్ ను అరవింద్ గారు ఇచ్చిన నమ్మకంతోనే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లగలిగాను. గీతా ఆర్ట్స్ లో ఎన్నో మంచి మంచి రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. `ప్రతిరోజుపండగే` కూడా అలాంటి ఒక రెస్పాన్సిబుల్ ఫిలిం. ఈ సినిమాకి సత్యరాజ్ గారు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. అలాగే రవిశంకర్ గారు ఈ సినిమాని ప్రేమించి సత్యరాజ్ గారికి వాయిస్ ఇవ్వడం జరిగింది. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. వంశి, వాసు ప్ర‌తి విష‌యంలో నన్నుపర్ఫెక్ట్ గా జడ్జ్ చేస్తూ వచ్చారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
జయ కుమార్ విజువల్ కొత్తగా ఉంటాయి. రాశిది సింపుల్ గా ఉండే బబ్లీ అమ్మాయి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఈరోజుతో సాంగ్ పూర్తియింది. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్‌ల‌ వారు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ మీల్స్ లా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్‌గా ఉంటూనే మంచి మెసేజ్ఉన్న చిత్ర‌మిది” అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ – ” చాలా హార్ట్ టచింగ్ స్క్రిప్ట్. మారుతి ఈ సినిమాతో వెరీ బిగ్ హిట్ ఇవ్వబోతున్నాడు. సినిమా మంచి మ్యూజిక్ కోసం హంగ్రీ గా ఉంది. సినిమా బాగుంటే కానీ మంచి మ్యూజిక్ అడగదు. అలాగే మంచి ఆర్.ఆర్ కుదిరింది. మారుతి ఈ కథ చెప్పనప్పుడే మమ్ములనందరిని కదిలించింది. మారుతి ఈ సినిమా ద్వారా తేజ్ కి నాకు పెద్ద సక్సెస్ ఇవ్వబోతున్నందుకు హ్యాపీ గా ఉంది. అందరిని ఎమోషనల్ గా కదిలిస్తుంది ఈ సినిమా. ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, మారుతి గారికి ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ రాశి ఖన్నా మాట్లాడుతూ – ” ఈరోజుతో షూటింగ్ పూర్తయింది. ప్రతి సినిమా షూటింగ్ అయిపోగానే అందరం బాధపడతాం. కానీ ఈ సినిమాకి అందరం హ్యాపీ మోడ్‌లో ఉన్నాం. ఈ సినిమా నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. యూవీ లో `జిల్` సినిమా చేశాను. చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. అలాగే ఎప్పటినుండో గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయాలి అనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది. మారుతి గారు చాలా క్లారిటీతో తీశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరికి కనెక్ట్ అవుతుంది. సాయి వెరీ నైస్ కో స్థార్” అన్నారు.

సుప్రీం హీరో సాయితేజ్ మాట్లాడుతూ – “గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లో ఎప్పటినుండో సినిమా చేయాలి అనేది నా కోరిక. వారిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘ప్రతి రోజు పండగే. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవ‌కాశం వచ్చినందుకు. అలాగే నేను 2014 నవంబ‌ర్‌14 న గీతా ఆర్ట్స్‌, దిల్‌రాజు గారి సంస్థ ద్వారా ఇంట్ర‌డూస్ అయ్యాను. మళ్ళీ 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత గీతా ఆర్ట్స్ లో చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. మ‌ళ్ళీ నా హోమ్‌ బేన‌ర్ కి వచ్చిన ఫీలింగ్ క‌లిగింది. అరవింద్ గారు నేను ఇండస్ట్రీ కి వచ్చినప్పటినుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన వంశి అన్న‌కి, అర‌వింద్ గారికి థాంక్స్‌. చాలా మంచి క‌థ‌. ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యి దాంతో ట్రావెల్ చేస్తారు. అలాగే సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్ కి ఆయ‌న యాప్ట్‌. రాశి ఏంజెల్ క్యారెక్టర్ చాలా ఫన్నీ గాఉంటుంది. బెల్లం శ్రీదేవి త‌ర్వాత అంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఉండే క్యారెక్ట‌ర్‌. థమన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చారు. మారుతి గారి స్పీడ్ మ్యాచ్ చేస్తూ క్వాలిటీ మిస్ అవ‌కుండా జయకుమార్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఇంతమంది ఆర్టిసులని ఒక బ్యూటిఫుల్ స్టోరిలోకి తీసుకు వచ్చిన మారుతి గారికి థాంక్స్. రేపు ఈ సినిమా చూశాక 6 నుండి 60 వ‌య‌స్సున్న ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు. మా సినిమా నుండి మూడో పాట `త‌కిట త‌కిట` విడుదలవుతుంది. ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ కూడామీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. మా సినిమాని స‌పోర్ట్ చేస్తున్న మీడియాకి ధ‌న్య‌వాదాలు” అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – ” భలే భలే మొగాడివోయ్ తర్వాత గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో నేను చేస్తున్న సినిమా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్యూ” అన్నారు.

నటీనటులు: సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here