టాలీవుడ్ లో చాలా కాలం తరువాత ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. హై బడ్జెట్ అనే కాకుండా సినిమా కథతో పాటు మేకింగ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు అందేలా చేస్తుందని అర్జున్ రెడ్డి కంటెంట్ నిరూపిస్తోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ కథ బాక్స్ ఆఫీస్ రికార్డులను నమోదు చేసింది. కబీర్ సింగ్ నిర్మాతలకు మంచి లాభాలని అందించిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఆ కథ జోరు తమిళ్ లో కూడా కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది. విక్రమ్ తనయుడు ధృవ్ నటించిన ఆదిత్య వర్మ నేడు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. మంచి ఓపెనింగ్స్ కూడా అందినట్లు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నట్లు ఆడియెన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన గిరీశయ ఆదిత్య వర్మకు దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ కంటెంట్ లో ఉన్న ఫీల్ ఏ మాత్రం చెదరకుండా దర్శకుడు సినిమాని తెరకెక్కించడంతో ఆడియెన్స్ కి సినిమా కరెక్ట్ గా కనెక్ట్ అవుతోంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు లాభాలని అందిస్తుందో చూడాలి.


