పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ కార్తీ సినిమాలను ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ప్రేమిస్తుంటారు. టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి మార్కెట్ సెట్ చేసుకున్న ఈ స్టార్ హీరో బ్రదర్ ఇటీవల ఖైదీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన బలాన్ని చూపించాడు. ఇక నెక్స్ట్ కూడా మళ్ళీ అదే తరహాలో సౌత్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని కార్తీ ప్లాన్ చేసుకుంటున్నాడు.
కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మరో ప్రయోగాన్ని చూపించబోతున్నాడు. వదినమ్మ జ్యోతికతో చేస్తోన్న తంబీ సినిమా ఫస్ట్ నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంటోంది. ఇక సినిమాకు సంబందించిన మరికొన్ని స్వీట్ పోస్టర్స్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. షావుకారు జానకితో పాటు సత్యరాజ్ – సీత వంటి సీనియర్ యాక్టర్స్ తో కార్తీ – జ్యోతిక ఒకే కుటుంబంలో ఉన్నట్లు కనిపిస్తుండడం ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో మధ్యతరగతి కుటుంబాలకు సంబందించిన ఎమోషన్ ని ఎలివేట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అక్కా తమ్ముడుగా జ్యోతిక కార్తీ ఎలా కనిపిస్తారు అనేది అందరిని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో కార్తీ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


