‘తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’ చిత్రాన్నిచూసి ఆడియన్స్ పడి పడి నవ్వుకుంటున్నారు – హీరో సందీప్ కిషన్.

0
595

యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్ గా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ “. ఈ చిత్రం నవంబర్15న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిలేరియస్ హిట్ గా నవ్వుల్నీ పంచుతూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో….

దర్శకుడు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ – ” తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ చిత్రాన్ని థియేటర్ కి వచ్చి చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా విడుదలై వారం రోజులు అయింది. ఈ సినిమా కేవలం మౌత్ టాక్ వల్లనే ఆడుతుంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఆడియన్ సినిమా చూసి బాగుంది అని చెప్పక పొతే 100% ఇంత కలెక్షన్స్ వచ్చేవి కాదు. ఒక సినిమా కలెక్షన్స్ బాగున్నాయా లేదా?, హిట్టా కాదా అని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. అలాగే సందీప్ కిషన్ కి మంచి పెర్ఫార్మర్ గా పేరుంది. ఈ సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ అన్ని చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సందీప్ ఈ సినిమా తర్వాత కచ్చితంగా బిగ్ కమర్షియల్ హీరో స్లాట్ లోకి వెళ్తారు. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ తో హ్యాపీ గా ఉన్నాం. ఇంకా పెరుగుతాయి అని ఆశిస్తున్నాము. త‌ప్ప‌కుండా త్వ‌ర‌లో సందీప్ కిషన్ తో మరో మంచి ఎంటర్టైనర్ చేస్తాను. అది కూడా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే.. ఒక హీరో సినిమాను ఎంజాయ్ చేస్తూ చేస్తే మిగతా ఆర్టిస్టులకు కూడా బలం వస్తుంది దాంతో ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశం 30-40 పర్సెంట్ పెరుగుతుంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ కూడా ఈ కలెక్షన్స్ కొనసాగుతాయని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – “నేను ఎప్పుడూ నా సినిమాల రిజల్ట్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. ఈ సినిమాను కూడా ఆడియన్స్ చూసి ఏం చెప్తున్నారు అని చెప్పడానికే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అలాగే నేను కూడా చాలా థియేటర్స్ కి వెళ్లి చూడడం జరిగింది. యనామినస్ గా అన్ని థియేటర్స్ లో 70% ఆడియన్స్ పడి పడి నవ్వుకుంటున్నారు. అలాగే నిన్న చాలా పెద్ద వ్యక్తి ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి సినిమా బాగా నచ్చిందండి. మీ సినిమా ట్రైలర్స్ మాకు పంపండి మా మీడియాలలో ఫ్రీగా టెలికాస్ట్ చేస్తాం అని చెప్పారు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ సేవ్ అయ్యారు. మిగతా వారు ఈ వారంలో సేవ్ అవుతారు. నేనొక పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ చేద్దాం అనుకోని చేయడం జరిగింది. సినిమా చేస్తున్నంత సేపు నేను నాగేశ్వర్ రెడ్డి గారు జెన్యూన్ గా ఎంజాయ్ చేశాం. దర్శకుడిగా ఆయన నాకు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకున్నారు. సినిమా చూడని వారు థియేటర్ లో చూడండి మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా పడి పడి నవ్వుకుంటారు” అన్నారు.

నిర్మాత సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ – ”తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’ చిత్రానికి విడుదలైన అన్ని ఏరియాల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ లభించింది. సినిమాలో కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను ఇంతటి సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

ఈ కార్యక్రమంలో నటుడు కాదంబరి కిరణ్, చమ్మక్ చంద్ర, గిరిధర్, రజిత తదితరులు పాల్గొని దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here