జ్యోతిక, రేవతి ప్రధానపాత్రలలో రూపొందిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్‌పాట్` నవంబ‌ర్ 22న గ్రాండ్ రిలీజ్‌!!

0
524

జ్యోతిక, రేవతి ప్రధానపాత్రలలో రూపొందిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌’జాక్‌పాట్’. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగి బాబు, ఆనంద్ రాజ్ ప్ర‌ముఖ పాత్ర‌ల్లో న‌టిస్తున్నఈ చిత్రానికి కళ్యాణ్ దర్శకుడు. చాలా కాలం తర్వాత జ్యోతిక ‘జాక్‌పాట్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్ ద్వారా నవంబర్ 22న గ్రాండ్ గా విడుదలచేస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

2డి ఎంటర్టైన్మెంట్స్ రాజశేఖర్ మాట్లాడుతూ – “ఈ సినిమా మా టీమ్ అందరికీ చాలా స్పెషల్. ఎందుకంటే మా 2డి ఎంటర్టైన్మెంట్స్ బేనర్ లో ఇప్పటివరకూ రూపొందిన అన్ని సినిమాలు మంచి కంటెంట్ తో పాటు మంచి సోషల్ మెస్సేజ్ ఉన్నవే. అయితే ఈ సినిమా కొంత డిఫరెంట్ ఎందుకంటే ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ చిన్న సందేశం కూడా ఉంది. మా దర్శకుడు కల్యాన్ ఈ స్టోరీ చెప్పేటప్పుడే నేను జ్యోతిక గారు బాగా నవ్వుకున్నాం. కథ వినగానే వెంటనే మన బేనర్ లోనే ఈ సినిమా తీద్దాం అని ఫిక్స్ అయ్యి సినిమా తీయ‌డం జ‌రిగింది. ఈ సినిమా షూటింగ్ 35 రోజుల్లోనే కంప్లీట్ చేసినప్పటికీ మీకు విజువల్ పరంగా, క్వాలిటీ పరంగా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. మా టీమ్ లో ప్రతి ఆర్టిస్ట్, టెక్నిషియన్ ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశారు. ఇంత మంచి సబ్జెక్ట్ ని మాదగ్గరకు తీసుకువచ్చిన మా డైరెక్టర్ కల్యాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గీతా ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్ననా మిత్రుడు బన్నీ వాస్ గారికి థాంక్స్. జ్యోతిక గారు, రేవతి గారు బోర్న్ యాక్ట్రెస్. అలాగే ఈ సినిమాలో ఆనంద్ రాజ్ క్యారెక్టర్ మిమ్మల్ని పూర్తిగా ఎంటర్టైన్ చేస్తుంది” అన్నారు.

మాటల రచయిత భారతి బాబు మాట్లాడుతూ – “నా మీద నమ్మకంతో తమిళంలో సినిమా చూడగానే అగ్రిమెంట్ చేసి కంటెంట్ చేతికి ఇచ్చి పంపించారు. ఆ నమ్మకాన్ని 20 రోజులు ఎంతో కష్టపడి మంచి అవుట్ ఫుట్ తో నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. చాలా మంచి సినిమా. జ్యోతిక గారి క్యారెక్టర్ లో నాలుగైదు షేడ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలోనే ఇటువంటి జోనర్ లో ఏ సినిమా రాలేదు. ఇది ఒక జోనర్ అని కాదు జోనర్ షిఫ్ట్ అవుతూఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. పెద్ద విలన్ గా కనపడే ఆనంద్ రాజ్ గారు అక్క క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. కల్యాన్ గారు రాత్రి పగలు తేడా లేకుండా ఈ సినిమా కోసం హార్డ్‌ వర్క్ చేశారు” అన్నారు.

నటుడు ఆనంద్ రాజ్ మాట్లాడుతూ – “రాజకీయాలలో కొంచెం బిజీ అవ్వడం వల్ల ఇటు తెలుగులో కానీ అటు తమిళ్ లో కానీ కనపడలేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మీ అందరి ముందుకు వచ్చాను. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీ గాఉన్నాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఈ చిత్రంలో జ్యోతిక గారు అంత రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ ని చాలా చక్కగా చేశారు. అలాగే రేవతి గారు కూడా బాగా చేశారు. ఈ క్యారెక్టర్ కి నన్ను సెలెక్ట్ చేసిన మా ప్రొడ్యూసర్, నా తమ్ముడు సూర్య గారికీ నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. తెలుగులో నేను చేసిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. అలాగే కోడి రామకృష్ణ గారు 87 లో నన్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత నేను నటించిన `సూర్యవంశం`, `బావ బావమరిది` ఇలా అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. తెలుగు ఆడియన్స్ కి సినిమా అంటే రెస్పెక్ట్. మంచి ఇంపార్టెంట్ ఇచ్చి త‌ప్ప‌కుండా సక్సెస్ చేస్తారు. అలాగే నేను గీతా ఆర్ట్స్ లో అరవింద్ గారితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆతర్వాత తెలుగులో చాలా మంది నటులతో కలిసి వర్క్ చేశాను. ఆ సెంటిమెంట్‌తో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం” అన్నారు.

దర్శకుడు కల్యాన్ మాట్లాడుతూ – “ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి, జ్యోతిక గారికి థాంక్స్. ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్సీషియ‌న్ ప్రాణం పెట్టి చేశారు. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. నవంబర్ 22న విడుదలవుతుంది. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావలి ‘అన్నారు.

న‌టీన‌టులు:
జ్యోతిక‌, రేవతి, యోగిబాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్ర‌న్, మ‌న్సూర్ అలీ ఖాన్, జ‌గ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: క‌ల్యాన్‌
నిర్మాత‌: సూర్య శివ‌కుమార్
స‌హ నిర్మాత‌: రాజశేఖ‌ర్ కరూప‌సుంద‌ర పాండియ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
ఎడిట‌ర్: విజ‌య్ వేలుకుట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here