“లైఫ్ అనుభ‌వించురాజా ” మూవీ ట్రైలర్ లాంచ్‌

0
872

రాజారెడ్డి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఎఫ్ అండ్ ఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ తిరుమూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం లైఫ్ అనుభ‌వించు రాజా. రాజారెడ్డి కందాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూత‌న న‌టీన‌టులు జూనియ‌ర్ ర‌వితేజ‌, శృతిశెట్టి, శ్రావ‌ణినిక్కి జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని శుక్ర‌వారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ముఖ్య అతిధిగా విచ్చేసిన‌ ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతులు మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల అయింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో…

రాజ్‌కందుకూరి మాట్లాడుతూ … ప్ర‌తి ఒక‌ళ్ళ లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఎంజాయ్ చెయ్యాల‌నుకుంటారు. ఎప్పుడూ నిర్మాత అనేవాడు బ్యాక్‌బోన్ ఆఫ్ ద ఫిల్మ్. ముందుగా నేను హోల్ హార్టెడ్ ఐ ఎప్రిషియేట్ ఈ చిత్ర నిర్మాత అయిన రాజారెడ్డిగారు. చిన్న సినిమాలు ఈ టైంలో రిలీజ్ చేసే టైం. ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. ర‌వితేజ చాలా బాగా చేశాడు. నేను త‌ను చేసిన కొన్ని సీన్స్ చూశాను. హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. మ్యూజిక్‌, కెమెరా, లిరిక్స్ ఈ చిత్రానికి బాగా కుదిరాయి. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ద బెస్ట్ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్ మాట్లాడుతూః  నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు బిగ్ థ్యాంక్స్ టు ద డైరెక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్ అని అన్నారు.

హీరోయిన్ శ్రావణి నిక్కి మాట్లాడుతూఃముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చాలా బాగా వ‌చ్చింది అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి మమ్మ‌ల్ని ఆద‌రించండి.

హీరోయిన్ శృతిశెట్టి మాట్లాడుతూః  నాకు ఈ సినిమాలో న‌టించినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. నేను ఈ స్టేజ్ మీద ఉండ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం షానీకి నా ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు. ఈ సినిమాని అంద‌రూ చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించ‌గ‌ల‌రు.

హీరో ర‌వితేజ మాట్లాడుతూః ఈ మూవీలో ఛాన్స్ నాకు ఆడిష‌న్ ద్వారా వ‌చ్చింది. నాకు సురేష్‌గారు ఒక‌రోజు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ట్రైల‌ర్ మీ అంద‌రికి న‌చ్చింది అనుకుంటున్నాను సినిమా కూడా మీ అంద‌రికి న‌చ్చుతుంది. మీరంద‌రూ చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాలి అని అన్నారు.

షానీమాట్లాడుతూః  ప్ర‌తి మ‌నిషి లైఫ్‌లో స్వీట్ మూమెంట్ సినిమా ఇది. చాలా క‌ష్ట‌మైన టైంలో హిమాల‌యాల‌కి వెళ్ళి షూట్ చేశాం. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు సురేష్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఈ ఈవెంట్ కోసం వ‌చ్చిన రాజ్‌కందుకూరిగారికి చాలా థ్యాంక్స్‌. న‌న్ను ఎంతో బ్యూటీగా చూపించిన కెమెరామెన్‌కి థ్యాంక్స్‌. ఆడిష‌న్స్ చేసి అంద‌రూ కొత్త వాళ్ళ‌ని సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్ట‌ర్ ఒక తెలుగ‌మ్మాయి, ఒక బాంబే అమ్మాయిని తీసుకున్నారు.

ద‌ర్శ‌కుడు తిరుమూరు మాట్లాడుతూః  నేను ఒక క‌థ ప‌ట్టుకుని చాలా ఆఫీసులు తిరిగాను. కానీ అవ‌కాశాలు రాలేదు. ఒక రోజు క‌థ విని మా మేన‌బావ ప్రొడ్యూస్ చేశారు. ఆడియ‌న్స్‌కి బోర్ కొట్ట‌కుండా రెండు గంట‌లు ఎంట‌ర్‌టెయిన్ చెయ్యాల‌ని ఇది గ్యారెంటీగా మంచి సినిమా అవుతుంది. రాజారెడ్డి మా మేన‌బావ ఆయ‌న ఇంప్ర‌స్ అయి ముందుకు వ‌చ్చి ఈ సినిమాని తీశారు. ఒక్క‌రోజు కూడా షూటింగ్ స్పాట్‌కి రాలేదు. న‌న్ను ఎంతో బాగా ఎంక‌రేజ్ చేశారు. డ‌బ్బులు విష‌యంలో కూడా ఎక్క‌డా వెన‌కాడ‌కుండా తీశారు అన్నారు.

న‌టీన‌టులుః ర‌వితేజ‌, శ్రావ‌ణినిక్కి, శృతిశెట్టి, షాని, ప‌వ‌న్ నాగేంద్ర‌, ర‌త్నాక‌ర్‌, అనీలా త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః ర‌జ‌నీ, మేక‌ప్ఃసుమ‌న్‌, మ్యూజిక్ఃరామ్‌, ఎడిటింగ్‌, సునీల్‌మ‌హ‌రాజ్‌, నిర్మాతఃరాజారెడ్డి కందుల‌, ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వంఃసురేష్ తిరుమూర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here