యువహీరో శర్వానంద్ బ్యాక్ టూ బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ టాలెంటెడ్ హీరో మరోసారి పల్లె వాతావరణాన్ని తెరపై చూపించనున్నాడు. గతంలో శతమానం భవతి సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద శర్వాకి మంచి విజయాన్ని అందించింది.
ఇక నెక్స్ట్ కూడా అలాంటి కాన్సెప్ట్ ని టచ్ ని చేయనున్నాడు. శర్వా కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా సినిమా షెడ్యూల్ ని ఒక విలేజ్ లో స్టార్ట్ చేశారు. మట్టితో సావాసం చేసే రైతుగా శర్వా సినిమాలో కనిపిస్తాడని సమాచారం. రియాలిటీకి తగ్గట్లుగా సినిమాలో లొకేషన్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైన కనిపిస్తోన్న ఆ స్పెషల్ పిక్ ని చూస్తే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది.
శ్రీకారం అంటూ టైటిల్ లోనే ఆకర్షిస్తున్న శర్వా లొకేషన్స్ తో మరో మంచి ఫీల్ ని కలిగిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. శర్వా నెక్స్ట్ శ్రీకారం సినిమాతో పాటు 96 అలాగే మరో ద్విభాషా చిత్రంతో బిజీగా ఉన్నాడు.


