సరిలేరు నీకెవ్వరు సెట్స్ లో సూపర్ స్టార్ మహేష్ తో అనిల్ రావిపూడి

0
756

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏ కె ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.  ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్, అతి త్వరలో పూర్తి కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో సంగీత, రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, రావురమేష్, రఘుబాబు, హరితేజ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచగా, నేడు కాసేపటిక్రితం మహేష్, అనిల్ రావిపూడి కలిసి సెట్లో ఒక సీన్ విషయమై చర్చిస్తున్న పిక్ ని సినిమా యూనిట్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here