‘తిప్పరా మీసం’ పెద్ద హిట్ అయ్యి టీమ్ అందరికీ మంచి పేరు, నిర్మాతలకి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా-  సెన్సేషనల్ డైరెక్టర్  వి.వి.వినాయక్

0
703

శ్రీవిష్ణు హీరోగా నిక్కి తంబోలి హీరోయిన్ గా అసుర ఫేమ్ విజయ్ కృష్ణ ఎల్. దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మించిన చిత్రం “తిప్పరా మీసం”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న వరల్డ్ వైడ్ గా గ్లోబల్ సినిమాస్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.. ఈ చిత్రం ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 3న హైదరాబాద్ దసపల్ల హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం యల్ కుమార్ చౌదరి, హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటుడు, సమర్పకుడు అచ్యుత రామారావు, నటులు బెనర్జీ, నటి రోహిణి, రవిప్రకాష్, రవివర్మ , కమేడియన్ నవీన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. తొలి టిక్కెట్ ని వినాయక్, రోహిత్ కొనుగోలు చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.

సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ – “తిప్పరా మీసం’ టీమ్ అందరికీ మంచి పేరు, నిర్మాతలకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీ విష్ణు ఆడియన్స్ లో, ఇండస్ట్రీలో మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. నాకు శ్రీ విష్ణు ‘బ్రోచేవారెవరువా’సినిమా విపరీతంగా నచ్చి ఒక మూడు సార్లు అయినా చూసుంటాను. మంచి కథ సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ గా తెలిసిన హీరో. మంచి టీమ్, కథలతో సినిమాలు తీస్తున్నారు. ఇకముందు కూడా అలాగే తీయాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ అల్ ది బెస్ట్ ‘అన్నారు.

హీరో నారా రోహత్ మాట్లాడుతూ.. ఆల్మోస్ట్ ఈ టీమ్ అందరితో వర్క్ చేశాను. సినిమా చూశాను నాకు బాగా నచ్చింది. వండ్రఫుల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది.. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చెయ్యాలి. విజయ్ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ అవుతాడు.. విజయ్ తో నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా చేయబోతున్నాను.. అన్నారు.

ప్రముఖ నిర్మాత యం. యల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ – “తిప్పరా మీసం టైటిల్ కమర్షియల్ గా, అద్భుతంగా ఉంది. విష్ణు గత సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఉంటుంది అలాగే లిమిటెడ్ బడ్జెట్ లో ఉంటుంది. సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నారు. అలాగే విజయ్ కృష్ణ ‘అసుర’ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు ప్రతి సినిమాకు ఈరోజు మార్కెట్ లో బయ్యర్స్ ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ ముందుకు వచ్చి సినిమాను కొంటున్నారంటే శ్రీ విష్ణు రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. నెక్స్ట్ మూవీ మా పీపుల్స్ మీడియా లో మా అమ్మాయితో కలిసి చేస్తున్నాము రిజ్వాన్ గారు మంచి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. నేను వచ్చిన కొత్తలో ‘ఇడియట్’ అనే మూవీ తీశాను అది ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా రిజ్వాన్ గారికి అంత పెద్ద హిట్ అవ్వాలి ” అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ… తిప్పారామీసం చాలా పవర్ ఫుల్ మాస్ టైటిల్.. ఇలాంటి మాస్ టైటిల్ తో చేసిన ఈ ఫంక్షన్ కి వినాయక్ గారిలాంటి మాస్ డైరెక్టర్ గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇటివరకు చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉంటుంది. విజయ్ నేను చాలా రోజులుగా ట్రావెల్ అవుతున్నాం. చాలా ద‌గ్గరగా న‌న్ను చూశాడు. అలాంటి వ్యక్తి నెగిటివ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. కథ చాలా సూపర్ గా ఉంది. ప్రపంచంలో ఏదైనా మారొచ్చేమో గాని అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. అలాంటి మదర్ సెంటిమెంట్ తో చేసిన ఈ చిత్రం అందరికీ మంచి ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. మదర్ గొప్పదనం గురించి చెప్పే ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. రోహిణీ గారు మదర్స్ ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని చూసి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.. రిజ్వాన్, విజయ్, రామారావు, ఖుషీ బాగా సపోర్ట్ చేశారు.. అన్నారు.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రిజ్వాన్ మాట్లాడుతూ – ” ఇక్కడికి వచ్చిన వినాయక్ గారికి, నారా రోహిత్ గారికి ధన్యవాదాలు. విజయ్ గారికి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది. సినిమా ఇంత బాగా వచ్చింది అంటే మా టీమ్అందరి సపోర్ట్ తోనే..అందుకే ఇది మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్లు ఉంది. విష్ణు గారు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు ఆయనకు మేకప్ అవసరం లేదు. ప్రతి గెటప్ లో సూట్ అవుతారు. ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్స్ ఎవరైనా నష్టాల్లో ఉంటే విష్ణు గారితో సినిమా తీస్తే సరిపోతుంది. సురేష్ మ్యూజిక్ కి ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫిలిం సక్సెస్ కొట్టడం అనేది కష్టమే కానీ మాకు అలా రాసిపెట్టి ఉందేమో” అన్నారు.

దర్శకుడు కృష్ణవిజయ్ యల్. మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ అందరం కలిసి చేసిన సినిమా ఇది. ఒక మంచి ప్రయత్నం చేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. శ్రీవిష్ణు క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రోహిణి గారి క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మదర్ పాత్రకు ప్రాణం పోసి చేశారమే. ఈ క్రెడిట్ అంతా మా టీమ్ కె చెందుతుంది.. ఈ నెల 8న సినిమా విడుదలవుతుంది.. అన్నారు.

కో-ప్రొడ్యూసర్ అచ్యుత రామారావు మాట్లాడుతూ – “నేను విజయ్ గారు కలిసి ఈ సినిమా చేద్దాం అనుకున్నా సమయంలో రిజ్వాన్ గారు, ఋషిగారు మాతో జాయిన్ అయ్యారు. వారితో అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీ. తిప్పరా మీసం సినిమా గురించి చెప్పడం కంటే నవంబర్ 8న మీరే చూసి తెలుసుకుంటారు. అంత బాగా వచ్చింది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి, ప్రతి టెక్నీషన్ కి కూడా మంచి పేరు వస్తుంది. సినిమా రిలీజైన వెంటనే మా విజయ్ గారు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అవుతారు. రోహిణి గారు చాలా సపోర్ట్ చేశారు.మేము సినిమా స్టార్ట్ చేశాక నీది నాది ఒకే కథ పెద్ద హిట్ అయింది. తర్వాత బ్రోచేవారెవరురా ఇంకా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ అంతా పూర్తి అయింది. టీం అందరికి అల్ దిబెస్ట్ ” అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. చాలా మంచిపాత్ర. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చే చిత్రం ఇది.. అన్నారు.

నటి రోహిణి మాట్లాడుతూ.. దర్శకుడు విజయ్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. చాలా కొత్తగా నా క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నాను.. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here