షారుక్ – అట్లీ.. టైటిల్ ఫిక్స్

0
934

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. గతకొంత కాలంగా ఇంటర్నెట్ లో రూమర్స్ వచ్చినట్లుగానే షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఏనౌన్స్మెంట్ వచ్చింది. జస్ట్ హీరో నుంచి అఫీషియల్ ఏనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. దాదాపు స్టోరీ డిస్కర్షన్స్ షెడ్యూల్స్ ప్లానింగ్ వంటి విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చిన షారుక్ సినిమా టైటిల్ ని కూడా వీలైనంత త్వరగా ప్రకటించే అవకాశం ఉంది.

నవంబర్ 2న షారుక్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ఏనౌన్స్మెంట్ వెలువడనున్నట్లు టాక్ వస్తోంది. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. ‘సంకీ’ అనే టైటిల్ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అట్లీ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజైన అట్లీ బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా 200కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటింది. చూస్తుంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక డిసెంబర్ లో అట్లీ షారుక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here