నిరీక్షణ’ ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

0
690

సాయిరోనక్‌, ఎనా సహా జంటగా టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై వంశీక ష్ణ మళ్ళ దర్శకత్వంలో పి.రాజన్‌ నిర్మిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఈ చిత్రంలో మొదటిసారి ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’ విడుదల చేశారు. ‘రాక్షస..’ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ ”మా సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’కు చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా చాలా అద్భుతమైన క్యారెక్టర్‌ చేశారు. హీరోహీరోయిన్లు సాయిరోనక్‌, ఎనా సహా కూడా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు” అన్నారు.
సాయి రోనక్‌, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. శ్రద్ధా దాస్‌, సన స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి వి., సంగీతం: మంత్ర ఆనంద్‌, పాటలు: చంద్రబోస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాణం: టేక్‌ ఓకే క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here