మెగాబ్రదర్ నాగబాబు గారి తనయ నిహారిక కొణిదెల, ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ షోలు నిర్మిస్తున్నారు. ఇకపోతే నిన్నటి దీపావళి పండుగను పురస్కరించుకుని తన ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంతో సరదాగా పండుగను జరుపుకున్న పిక్ ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసారు.
‘ది హిట్లర్ పిక్చర్, మా అన్నయ్య ఎప్పుడూ నా వెనకే నిలబడి ఉంటారు’ అంటూ, అన్నయ్య వరుణ్ తేజ్ సహా, మెగాస్టార్ కుమార్తెలైన సుస్మిత, శ్రీజ మరియు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా దిగిన ఫోటోని ఆమె పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ పిక్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది….!!


