సాయి తేజ్ బర్త్ డే స్పెషల్.. ప్రతిరోజు పండగే ఫస్ట్ గ్లింప్స్

0
638

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ – టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ప్రతి రోజు పండగే. ఈ యువ హిరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ కి భిన్నంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ సున్నితమైన భావోద్వేగాలతో ఉండే కథను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

నేడు సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రతిరోజు పండగే ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. సింపుల్ అండ్ క్యూట్ గా సాయి కనిపించిన విధానం చాలా బావుంది. లైఫ్ అంటే సెలబ్రేషన్స్ నవ్వుతూ బ్రతకడమే అనే ట్యాగ్ తో దర్శకుడు మారుతి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన సినిమాలతో కడుపుబ్బా నవ్వించడమే కాకుండా ఎమోషన్ అండ్ మంచి మెస్సేజ్ ని సమపాళ్ళలో అందించిన ఈ దర్శకుడు ఈ సారి ప్రతిరోజు పండగే అంటూ ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

ఇక సినిమాలో ప్రతి పాత్ర గుర్తిండిపోయేలా డిజైన్ చేసినట్లు ఫస్ట్ గ్లింప్స్ లో అర్ధమవుతోంది. పచ్చని పొలాలు.. రాశి ఖన్నా అమాయకత్వ చూపులు.. సరదాగా అల్లరిగా కనిపిస్తున్న సర్యారాజ్ పాత్ర ..ఇలా అన్ని అంశాలు సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఏ సమయంలో వచ్చినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పండగ వాతావరణం క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. మరి రిలీజ్ పండగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. GA2 – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here