భాగమతి అనంతరం బాహుబలి బ్యూటీ అనుష్క నుంచి వస్తున్న చిత్రం నిశ్శబ్దం. కథల ఎంపికలో జేజమ్మ ఏ విదంగా ఆలోచిస్తుందో ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అర్ధమయ్యింది. చిత్ర యూనిట్ ఇన్ని రోజులు సైలెన్స్ గా షూటింగ్ పనులను చేసుకుంటూ వెళ్ళింది. ఇక ఇప్పుడు పోస్టర్స్ తో ప్రమోషన్ సౌండ్ ని పెంచుతోంది. మాధవన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
మాధవన్ సినిమాలో ఒక సెలబ్రెటీ మ్యూజిషియన్ గా కనిపించబోతున్నాడు. అతని పాత్ర పేరు ఆంటోనీ.
తన చార్మ్ తో మనసును దోచేస్తాడు అంటూ చిత్ర యూనిట్ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. పోస్టర్ లో కూల్ గా కనిపిస్తున్న మాధవన్ ప్రశాంతమైన ప్రకృతి మధ్యన తన సంగీతంతో ఏదో మాయ చేసేలా కనిపిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్ – విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.