భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్న క్యూట్ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది. రీసెంట్ గా కబీర్ సింగ్ తో అమ్మడు సరికొత్త బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీలనే కాకుండా హారర్ స్టోరిలకి కూడా కియారా కావాలని అంటున్నారు.
బాలీవుడ్ లో ఇటీవల లాంచ్ అయినా బుల్ బులియా 2 లో కియారా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన కాంచన రీమేక్ ‘లక్ష్మి బాంబ్’ లో నటిస్తోంది. ఇక ఇప్పుడు మరో హారర్ కాన్సెప్ట్ లో నటించడానికి ఒప్పుకుంది. సౌత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన చంద్రముఖి సినిమాను గతంలో అక్షయ్ కుమార్ బూల్ బులయ్యా గా రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జులై 31న రిలీజ్ కానుంది.


