మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే మొదటిసారి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా చిరంజీవిని బిగ్ స్క్రీన్ పై చూడాలని అందరిలో ఆతృత మొదలైంది. అయితే క్లయిమ్యాక్స్ సీన్ ని ఎలా చూపిస్తారు అనేది అందరిలో ప్రధానంగా ఉత్కంఠను రేపుతోంది. ఒక హీరో మరణించడం అనేది చాలా అరుదు.
సైరా నరసింహా రెడ్డి సినిమా విషయానికి వస్తే.. క్లయిమ్యాక్స్ లో ఆ సీన్ ని దర్శకుడు ఏ విధంగా ప్రజెంట్ చేశాడు అనేది ఆసక్తిని రేపుతోంది. సైరా సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు అందరూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే.. నరసింహారెడ్డి రెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసి.. మరణించిన అనంతరం తలను కోట గుమ్మానికి వ్రేలాడదీశారు. దేశంలో ఒక్కసారిగా భయాన్ని కలుగజేసిన ఆ విషయాన్నీ తెరపై ఎలా చూపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. అక్టోబర్ 2న రానున్న సైరా క్లైమాక్స్ హాట్ టాపిక్ గా మారింది.


