ఏఎంబి సినిమాస్ లో ‘సాహో’ సినిమా వీక్షించిన రెబల్ స్టార్ ప్రభాస్….!!

0
747

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సాహో. ఫస్ట్ డే నుండి మంచి  కలెక్షన్స్ తో దూసుకెళుతోంది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, సాంగ్స్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ సరసన జోడి కట్టిన ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మది అందించిన ఫొటోగ్రఫీ, అలానే జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఈ సినిమాను నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హైదరాబాద్ గచ్చి బౌలీలోని ఏఎంబి సినిమాస్ లో ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. ప్రభాస్ ఏఎంబి సినిమాస్ కు రావడంతో ఆ మల్టిప్లెక్స్ అధినేతల్లో ఒకరైన సునీల్ నారంగ్ మరియు ఏఎంబి టీమ్ ప్రభాస్ కు సాదరంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక ప్రభాస్ రాకతో ఏఎంబి సినిమాస్ ప్రాంగణం మొత్తం ఎంతో సందడిగా మారిపోయింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here