అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ కి పరిచయమయిన కొద్దీ కాలానికే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. మొదటి సినిమా ధఢఖ్ తో నటిగా ప్రశంసలు అందుకున్న జాన్వీ తల్లి శ్రీదేవి గురించి అలాగే తన డ్రీమ్ బాయ్ గురించి బ్రైడ్స్ టుడేకిచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.
జాన్వీ మాట్లాడుతూ.. ‘నేను త్వరగా ప్రేమలో పడిపోతానని అమ్మ నమ్మకం. నా జడ్జ్ మెంట్ కరెక్ట్ గా ఉండదని నాకు కాబోయే వాడిని తనే చూస్తానని చెప్పేది. ఇక నాకు కావాల్సిన వాడు అన్ని పనుల్లో శ్రద్దగా నిబద్దతో ఉండాలి. తన నుంచి నేను కూడా కొత్త విషయాలెన్నో నేర్చుకోవాలి. సెన్సాఫ్ హ్యూమర్ తో పాటు నన్ను ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడాలి. ఇక పెళ్లి మాత్రం పూర్తిగా సాంప్రదాయ పద్దతిలో మా అమ్మకి ఇష్టమైన తిరుపతిలోనే చేసుకుంటాను’ అని జాన్వీ అమ్మతో చెప్పుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.