నిను చూసే ఆనందంలో.. కనుపాపే కడలై పొంగినదే.. ‘నాని’స్‌ గ్యాంగ్‌లీడర్‌’ సెకండ్‌ సాంగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

0
529
నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఈ సినిమాలోని రెండో పాటను ఇటీవల విడుదల చేశారు. ‘నిను చూసే ఆనందంలో.. కనుపాపే కడలై పొంగినదే..’ అంటూ సాగే పాటను సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. అనంతశ్రీరామ్‌ సాహిత్యం అందించగా, అనిరుధ్‌ రవిచందర్‌ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. సింగర్‌ సిధ్‌ శ్రీరామ్‌కి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఈ పాట ఎంతో యూత్‌ఫుల్‌గా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌కి, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడీ రెండో పాటకు కూడా అదే రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, వి.ఎఫ్‌.ఎక్స్‌.: మకుట, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here