హాలివుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (ది రాక్) అంటే పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించుకున్న ఈ 47 ఏళ్ల కండల వీరుడు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. రెజ్లింగ్ స్టార్ గా ఒకప్పుడు రాక్ అని అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకున్న డ్వేన్ స్కార్పియన్ కింగ్, ది మమ్మీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ , జూమాంజి వంటి బాక్స్ ఆఫీస్ సినిమాల ద్వారా తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు.
ఇక గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న డ్వేన్ జాన్సన్ ఆగస్ట్ 18న తన ప్రియురాలు లారెన్ హాషియాన్ ను హవాయ్ దీవుల్లో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జాన్సన్ బహిర్గతం చేశాడు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో తన రెండవ భార్యతో సంతోషంగా పెళ్లి చేసుకున్నట్లు ఒక ఫొటో కూడా పోస్ట్ చేశాడు. 2007లో మొదటి భార్య డానీ గార్సియా నుంచి విడాకులు తీసుకున్న డ్వేన్ జాన్సన్ కి 18 సంవత్సరాల కూతురు కూడా ఉంది.


