ఆగష్టు 15న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ టీజర్….!!

0
144

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజయి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఈనెల 15న రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.

వరుణ్ ఫస్ట్ మూవీ ముకుందలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది . యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుణ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here