డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన రణరంగం తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది – దర్శకుడు సుధీర్ వర్మ

0
1681

స్వామిరారా , దోచేయ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సుధీర్ వర్మ. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా డైరెక్టర్ సుధీర్ వర్మ ఇంటర్వ్యూ.

రణరంగం సినిమాకు ఇన్స్పిరేషన్?

– గాడ్ ఫాదర్ 2 సినిమా ఆదర్శంగా తీసుకొని రణరంగం స్క్రీన్ ప్లే రాసుకున్నాను. జనరల్ గా ‘గ్యాంగ్ స్టర్’ మూవీ తీసే ఎవరికైనా గాడ్ ఫాదర్ మూవీనే ఓ ప్రేరణ అందులో సందేహమే లేదు. ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ ఫిలిం. ఎంత వరకూ సక్సెస్ అయ్యాం అనేది సినిమా రిజల్ట్ పై ఆదారపడి ఉంటుంది.

ఈ సినిమాకు శర్వానంద్ నే ఎంచుకోవడానికి కారణం?

– శర్వానంద్ చేసిన సినిమాల్లో నాకు ప్రస్థానం బాగా ఇష్టం.శర్వాతో చిత్రం చేస్తే ఫ్యామిలీ, లవ్ కాకుండా కొంచెం ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ తోనే సినిమా చేయాలని ఫిక్సయ్యాం. అలా రణరంగంతో మీ ముందుకు వస్తున్నాం.

ఈ కథకు శర్వానంద్ ఫస్ట్ ఛాయిసా?

– ఈ కథను ముందుగా రవి తేజ గారికి చెప్పాను. ఆయనకి కథ బాగా నచ్చింది. బిజీగా ఉండటం వల్ల శర్వా కి ఓ సందర్భంలో కథ వినిపించాను. కథ వినగానే శర్వా ఇలాంటి ఛాలెంజింగ్ సినిమా చేయాలనుందని, రవితేజ గారిని కన్విన్స్ చేయమని అడిగాడు. వెంటనే రవితేజ సరే అన్నాక శర్వాకి లుక్ టెస్ట్ చేసి సినిమా మొదలుపెట్టాను.

ఇప్పటి వరకూ చాలా గ్యాంగ్ స్టర్ సినిమాలు వచ్చాయి కదా! రణరంగం ఎలా డిఫరెంట్ గా ఉండబోతుంది?

– చాలా గ్యాంగ్ స్టర్ సినిమాలోచ్చినప్పటికీ రణరంగంలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. 90లో ఓ రెండు సంవత్సరాలు జరిగిన విషయం గురించి ఇంత వరకూ తెలుగులో ఎవరూ చూపించలేదు. నేను అది ట్రై చేసాను. సో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది.

ఫస్ట్ నుండి టైటిల్ ఇదే అనుకున్నారా?

-లేదండి! సినిమాకు టైటిల్ పెట్టడానికి చాలా టైం పట్టింది. ఒక పవర్ ఫుల్ టైటిల్ కోసం వెయిట్ చేసాం. దళపతి అనుకున్నాం కానీ కుదరలేదు. ఒక రోజు నిర్మాత వంశీ రణరంగం టైటిల్ సజెస్ట్ చేశారు. వినగానే సౌండింగ్ బాగుంది పైగా బ్యాటిల్ ఫీల్డ్ అనే మీనింగ్ కూడా వస్తుంది ఈ కథకి ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అనిపించి ఫైనల్ చేశాం.

‘గ్యాంగ్ స్టర్’గా శర్వానంద్ పెర్ఫామెన్స్?

– సినిమాలో శర్వానంద్ అచ్చం ‘గ్యాంగ్ స్టర్’లానే కనిపిస్తాడు. సినిమా అంతా శర్వా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. అంతబాగా తను ఆ రోల్ ను ఓన్ చేసుకుని చేశాడు. ‘రణరంగం’లోని శర్వా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఆ రెండు షేడ్స్ ను ఆయన పలికించిన విధానం సినిమాకు హైలెట్ గా ఉంటుంది.

మీ సినిమాల్లో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సినిమా ఏది?

– నా సినిమాల్లో రణరంగం నాకు ఛాలెంజింగ్ అనిపించింది. మేకింగ్ పరంగా కూడా ఛాలెంజింగ్ గా ఉంది. ఎందుకంటే సినిమాలో కొంత పార్ట్ 90 సంవత్సరంలో జరుగుతుంది. దానికోసం ఒరిజినల్ లోకేషన్స్ వాడలేక అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి షూట్ చేశాం. సెల్ ఫోన్స్ లాంటివేం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాకినాడలో షూట్ జరిగే సమయాల్లో అక్కడ వెహికల్స్ కనిపించకుండా ఇప్పటి వాతావరణం అని తెలియకుండా షూట్ చేసుకొచ్చాం. అలాంటివి ఈ సినిమా కోసం చాలా చేయాల్సి వచ్చింది.

ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే పెరిగిందట ?

– నిర్మాత నాగవంశీగారికి సినిమా అవుట్ ఫుట్ ముఖ్యం. ఎక్కడా క్వాలిటీ తగ్గుకుండా సినిమా చేయమని చెప్పారు. ఆ క్రమంలో ముందు అనుకున్నదాని కంటే బడ్జెట్ కొంచెం పెరిగింది. నా కెరీర్‌ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. వాస్తవానికి ఇప్పటివరకూ నాగవంశీగారు నాకు బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పలేదు. ఆయనకి బడ్జెట్ కంటే కూడా సినిమా క్వాలిటీ మాత్రమే ముఖ్యం.

హీరోయిన్ క్యారెక్టర్స్ గురించి?

– సినిమాలో గీత క్యారెక్టర్ కి కళ్యాణి అయితే పర్ఫెక్ట్ అనుకున్నాం. తను చాలా క్యూట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే రోల్ కి అందరి ఛాయిస్ కాజల్ . సో కాజల్ స్టోరీ చెప్పగానే నచ్చి ఒకే చెప్పి చేసింది. అలా ఇద్దరు హీరోయిన్స్ వారి క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు.

ట్రైలర్ లో విజువల్స్ విషయంలో మీకు మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా?

– అవునండీ! సినిమాలో విజువల్స్ఎక్స్ట్రార్డినరీ గా ఉంటాయి. ట్రైలర్ లో షాట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కేశవ’ సినిమాకు పనిచేసిన దివాకర్ మణి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసాడు. విజువల్స్ కి ఎలాంటి కాంప్లిమెంట్స్ అయినా తనకే చెందాలి. సినిమాకు బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?

– సితార బ్యానర్‌ లోనే నా తదుపరి సినిమా ఉంటుంది. ‘రణరంగం’ చేస్తున్నప్పుడే నాగవంశీగారు మరో సినిమా చేయమని అడిగారు. ప్రస్తుతానికి అయితే ‘రణరంగం’ సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘రణరంగం’ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా విడుదలయ్యాక మిగతా విషయాల గురించి ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు సుధీర్ వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here