కలర్ఫుల్ గా మన్మధుడు-2 ‘హేయ్ మెనినా’ సాంగ్….!

1
702

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మన్మధుడు-2. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గతంలో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై మంచి స్పందనని రాబట్టాయి.

ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా రానున్న హేయ్ మెనినా అనే పల్లవితో సాగె పాట వీడియోను నేడు రిలీజ్ చేసారు యూనిట్ సభ్యులు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ తానే స్వయంగా ఆలపించిన ఈ సాంగ్ లో కింగ్ నాగార్జున ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మరింత యంగ్ గా కనపడుతున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ ని తెలిపే ఈ సాంగ్ ని విదేశాల్లోని పలు కలర్ఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here