తమిళం లో సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న అజిత్ తో ఎప్పటి నుంచో పని చేయాలి అని ఆశపడింది అలనాటి అందాల తార శ్రీదేవి. శ్రీదేవి మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నప్పుడు, తను చేసిన ఇంగ్లీష్ వింగ్లిష్ అనే సినిమా లో ఒక చిన్న పాత్ర లో అజిత్ కుమార్ ను తీసుకుంది. వాళ్ళ ఇద్దరికీ ఒక మంచి అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి పని చేయాలి అని అనుకున్నారు కానీ అనుకోని కారణాల వలన అది కుదరలేదు. చివరికి ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి నింగికేగింది.
అయితే శ్రీదేవి భర్త, బోణీ కపూర్ మాత్రం చాలా ఏళ్ళ తర్వాత తమిళం లో సినిమా నిర్మిస్తూ, మొట్ట మొదట అజిత్ తో నే సినిమా చేయాలి అనే తలంపు తో హిందీ లో హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ హక్కుల ని కొని అమితాబ్ పాత్ర ని అజిత్ తో చేయించాడు. నెర్కొండ పార్వై అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే సింగపూర్ లో మొదలయ్యాయి. తమిళం లో కూడా ప్రెస్ షో పడింది.
ఈ సందర్భం గా బోనీ కపూర్ ఎమోషనల్ ట్వీట్ వేశారు. “నా భార్య శ్రీదేవి కోరిక ని తీర్చగలుగుతున్నాను. అజిత్ కుమార్, వినోత్ మరియు ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణులు లేకుంటే ఇది సాధ్యపడేది కాదు.” అని ఆయన ట్వీట్ చేశారు.