మురికివాడ` షూటింగ్ ప్రారంభం!!

0
640
శ్రీ సాయి అమృత లక్ష్మీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌ణ‌వి ప్రొడ‌క్ష‌న్స్ , శ్రీ లక్ష్మీ న‌ర‌సింహా క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య్, మ‌ధుప్రియ‌, ఆశ రాథోడ్, ప్రేమల‌ను  హీరో , హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ పాలిక్ ద‌ర్శ‌క‌త్వంలో తిరుప‌తి ప‌టేల్, రామ్, భాను , నీలిమ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `మురికివాడ‌`. ఈ చిత్రం ప్రారంభోత్స‌వ కార్యక్ర‌మం ఈ రోజు రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ల‌య‌న్ సాయి వెంక‌ట్ కెమేరా స్విచాన్ చేశాను. రామ‌స‌త్య‌నారాయ‌ణ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
అనంతరం  ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ…“మురికి వాడ నేప‌థ్యంలో జ‌రిగే క‌థాంశమిది. ఇందులో ఫ్రెండ్ షిఫ్, ఎమోష‌న్స్ , సోష‌ల్ మెసేజ్ తో పాటు అన్ని వ‌ర్గాల‌కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్  ఉంటాయి. త్వరలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి… మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. నా ఫ‌స్ట్ సినిమా `వెంచ‌ప‌ల్లి` చిత్రంతో కొత్త‌వారిని ప‌రిచ‌యం చేస్తున్నా…అలాగే ఈ సినిమా లో కూడా కొత్త హీరో ,హీరోయిన్స్ ని ప‌రిచ‌యం చేస్తున్నాం. ఇందులో ఐదు పాటలుంటాయి. చైత‌న్య సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు“ అన్నారు.
 నిర్మాతలు మాట్లాడుతూ…“ ద‌ర్శ‌కుడు పాలిక్ గారు `వెంచ‌ప‌ల్లి` సినిమా చేస్తున్న తీరు న‌చ్చి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో  ఈ సినిమా చేయ‌డానికి ముందుకొచ్చాం. ఈ సినిమా ద్వారా కొత్త వారిని ప‌రిచ‌యం చేస్తున్నాం.  క‌థ‌, క‌థ‌నాలు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటూ అంద‌ర్నీ అల‌రిస్తాయి“ అన్నారు.
హీరో విజ‌య్ మాట్లాడుతూ…“పాలిక్ గారు ఓ మంచి కాన్సెప్ట్ తో న‌న్ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. నా ఫ‌స్ట్ సినిమాకు మీ అంద‌రి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నా“ అన్నారు.
 న‌టి గీతా సింగ్ మాట్లాడుతూ..“ ఇంత వ‌ర‌కు చేయ‌ని ఓ డిఫ‌రెంట్ క్యార‌క్ట‌ర్ `మురికివాడ‌` చేస్తున్నాను“ అన్నారు.
 న‌టుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ…“ఇందులో నేను నెగిటివ్ క్యార‌క్ట‌ర్ లో కనిపిస్తాను“ అన్నారు.
 అశోక్ కుమార్, గీతాసింగ్, మాస్ట‌ర్ అభిగ్య‌న్, మాస్ట‌ర్ ల‌క్కీ, బేబి ప్ర‌ణ‌వి, పంక‌జ్, రోహిత్, రామ్ సింగ్, వంశీకృష్ణ‌, చంద్ర సిద్ధార్థ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫిః మ‌ల్లిఖార్జున్,  నిర్మాత‌లుః తిరుప‌తి పటేల్, రామ్, భాను, నీలిమ; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః పాలిక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here