విభిన్న కథాంశంతో ప్లే బ్యాక్

0
490

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకు స్క్రిప్ట్, నాగచైతన్య 100% లవ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి గుర్తింపు తెచ్చుకున్నారు హరిప్రసాద్ జక్కా. దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన తాజాగా తన రెండవ సినిమా టైటిల్ ప్రకటించారు. ప్లేబ్యాక్ అనే టైటిల్ తో మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లో 1993 మరియు 2019 లైన్స్ ఉన్నాయి.

హుషారు ఫేమ్ దినేష్ తేజ్, మల్లేశం ఫేమ్ అనణ్య ఇందులో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై PNK ప్రసాద్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె బుజ్జి  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here