ట్విట్టర్ లో 8 మిలియన్ల ఫాలోవర్లతో సూపర్ స్టార్ మహేష్…!!

0
448

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ తో పాటు తమ కుటుంబానికి సంబందించిన విషయాలను కూడా ఎప్పటికపుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే మహేష్ టాలీవుడ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరో.

నేడు తన ఖాతాలో 8 మిలియన్ల ఫాలోవర్లతో సౌత్ ఇండియా లోనే 8 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువ మంది స్టార్స్ లో ఒకరిగా నిలిచారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరో సాధించిన ఈ రికార్డు పై హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్, అతి త్వరలో ఆగస్ట్ 9 న తన జన్మదినాన్ని జరుపుకొనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here