టాలీవుడ్ లో తన సహజ నటనతో ప్రేక్షకుల నుండి నాచురల్ స్టార్ గా పేరు సంపాదించిన హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ గ్యాంగ్ లీడర్. విభిన్న తరహా సినిమాలు తీయడంలో మంచి పేరుగాంచిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మరియు ఒక సాంగ్ ఇటీవల విడుదలై మంచి స్పందనని రాబట్టింది . నేడు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ తో అలానే లక్షకు పైగా లైక్ లతో దూసుకుపోతోంది.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే సీన్స్ తో పాటు నాని ఫన్నీ డైలాగ్స్ టీజర్ కు ఇంత అత్యద్భుత స్పందనను రాబట్టాయి. ఇక టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి లక్ష్మి, ప్రియాంక, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.


