కింగ్ నాగార్జున ‘మన్మధుడు-2’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్…..!!

0
213

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన్మధుడు-2. గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ, మంచి హిట్ సాధించి అప్పట్లో నాగ్ కు సూపర్ సక్సెస్ ని అందించింది. ఇక మళ్ళి ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు-2 రూపొందుతున్న విషయం తెలిసిందే. యువ నటుడు మరియు దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్, మనం ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ లో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ  ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన రెండు టీజర్లు మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ మూవీలోని చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘హేయ్ మెనినా’ అనే పల్లవితో సాగె సాంగ్ ని ఈనెల 21న సాయంత్రం 5గంటలకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు హీరో నాగార్జున కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరచడం జరిగింది. ప్రస్తుతం శరవేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here