స్వంత యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు సితార

0
470

మహేష్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. తద్వారా ఆమె తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది. అందుకే ఆమె అంటే మహేష్ అభిమానులకి ప్రత్యేకమైన అభిమానం. అయితే తాజాగా సితార ఒక యూట్యూబ్ ఛానెల్ లాంచ్ చేసింది.

అది కూడా మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టడం విశేషం. మహర్షి సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఈ ఛానల్ ద్వారా వారి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఛానెల్‌కు ‘ఆద్య వర్సెస్ సితార’ అని నామకరణం చేశారు. ఇందులో పిల్లలకు వినోదాన్నిచ్చే ఫన్నీ ఛాలెంజెస్, టాస్క్స్, గేమ్స్, ఫైటింగ్స్ ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఒక వీడియోను కూడా అవుప్లోడ్ చేసేశారు. మరి ఈ ఛానెల్ ద్వారా సితార ఎంత హంగామా చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

mahesh babu daughter launched you tube channel along with vamsi padipally daughter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here