కెఎస్‌100 విడుదలైన అన్ని థియేటర్స్ లోనూ మౌత్ పబ్లిసిటీ తో మంచి కలెక్షన్స్ సాధిస్తుంది – చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి

0
94

చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్‌ స్టార్స్‌ సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ హీరోహీరోయిన్‌లుగా షేర్‌ (షాలిని ఫేమ్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”కెఎస్‌100 ”. జులై12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయ్యి మౌత్ పబ్లిసిటీ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది . ఈ సందర్భంగా జులై 15 న చిత్ర యూనిట్ సక్సస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో

చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు. నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అనుకుంటున్నా. ‌నన్ను, నా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు

చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ – ” కెఎస్100″ సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. సినిమా విడుదలై మా కష్టానికి తగ్గ ప్రతిఫలం‌ లభించింది. చిన్న సినిమాలాగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరికి ఈ సినిమా ఒక మెమరబుల్ గా ఉంటుంది. అన్ని విధానాల నాకు సహకరించిన ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “కెఎస్100” చిత్రం జులై 12న దాదాపు 200 థియేటర్స్ లో రిలీజ్ అయి యూత్ ను విపరీతంగాఆకట్టుకుంటొంది… విడుదలైన అన్ని థియేటర్స్ లోనూ మౌత్ పబ్లిసిటీ తో మంచి కలెక్షన్స్ సాధిస్తుంది . ఒక మంచి ట్రెండీ సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందొ అనడానికి మా సినిమా నే ఉదాహారణ. డైరెక్టర్ షేర్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ మా సినిమా ద్వారా ఇచ్చారు’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా నాకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది” అన్నారు.

సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫారూఖ్ మాట్లాడుతూ.. ఐదు సినిమాల మధ్య విడుదలై ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతోంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here