‘ఉండిపోరాదే’ మూవీ “తొలిసారి నిన్ను” సాంగ్ ….!!

0
1338

నూతన నటీనటులు తరుణ్ , లావణ్య జంటగా రూపొందుతున్న కొత్త చిత్రం ఉండిపోరాదే. వాస్తవికతకు దగ్గరగా హృద్యంగా ఆకట్టుకునే ప్రేమ కథగా అలరించే కథనంతో రూపొందుతున్న ఈ సినిమా కన్నడ ఆడియో ఇటీవల విడుదలై మంచి సక్సెస్ సాధించింది. తమ సినిమా చూస్తే ఒక ప‌క్కింటి అమ్మాయి జీవితం చూసిన‌ట్టుగా సినిమా ఉంటుందని, అలానే సాంగ్స్ కూడా వీక్షకులను అలరిస్తాయని అంటున్నారు దర్శకుడు న‌వీన్ నాయని. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ, కథతో పాటు కథానుసారం వచ్చే ఆడియో విష‌యంలో చాలా జాగ్ర‌త్త తీసుకున్నాం, సంగీత దర్శకుడు స‌బు వ‌ర్గీస్ అందించిన ఆడియో సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని అయన అన్నారు. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నిర్మాత డా.లింగేశ్వ‌ర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని ‘తొలిసారి నిన్ను’ అనే పల్లవితో సాగె పాటను కాసేపటి క్రితం సినిమా యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేసింది. మంచి మెలోడియస్ బీట్ తో సాగే ఈ సాంగ్ కి లింగేశ్వర్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. సింగర్ యాసిన్ నజీర్ బ్యూటిఫుల్ వాయిస్ తో సాగే ఈ సాంగ్, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. సిద్ధిక్ష‌, అజ‌య్ ఘోష్‌, సీనియ‌ర్ సూర్య‌, సుజాత‌, రూపిక‌, స‌త్య కృష్ణ‌, కేదార్ శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫ‌ర్ః శ్రీను విన్న‌కోట‌; స్టంట్స్ః రామ్ సుంక‌ర‌. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here