టాలీవుడ్ లో ఎక్కువగా విభిన్నమైన కథాంశం గల చిత్రాల్లో నటిస్తూ యువ హీరోగా తన ఇమేజిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో శర్వానంద్. ఇక ప్రస్తుతం తమిళ చిత్రం 96 రీమేక్, అలానే రణరంగం అనే రెండు చిత్రాల్లో నటిస్తున్న శర్వానంద్, నేటి ఉదయం మరొక నూతన చిత్రం `శ్రీకారం` ఆదివారం లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించే ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు సుకుమార్ క్లాప్ ని కొట్టగా, ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ చిత్రానికి మాటల రచయితగా పని చేస్తున్న బుర్రా సాయిమాధవ్, చిత్ర స్క్రిప్ట్ ని తన చేతులమీదుగా దర్శకుడికి అందచేయడం జారిగింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను కిశోర్ రెడ్డి అందించగా మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆగష్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి.
శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిశోర్ రెడ్డి
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
సంగీతం: మిక్కి జె.మేయర్
సినిమాటోగ్రపీ: యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్: అవినాశ్ కొల్ల
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా


