‘కల్కి’ ఒక డిఫరెంట్, థ్రిల్లింగ్ ఫిల్మ్: అదా శర్మ ఇంటర్వ్యూ

0
108

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ పిక్చర్స్’ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి చిత్రానికి, అందులో తన పాత్రకు వస్తున్న స్పందన పట్ల అదా శర్మ సంతోషం వ్యక్తం చేశారు. రాజశేఖర్ సరసన కథానాయికగా నటించడం అమితానందంగా ఉందన్నారు. సినిమా విజయవంతంగా పదర్శింపబడుతున్న సందర్భంగా అదా శర్మతో ఇంటర్వ్యూ…

రెట్రో స్టయిలింగ్‌లో బావున్నారు!

థాంక్యూ. సినిమాలో పాత్రలను ప్రతిబింబించేలా ప్రమోషన్స్‌కి రావడం నాకు ఇష్టం. ‘కల్కి’ చారిత్రక చిత్రం కాబట్టి అప్పటి స్టైల్ లో వచ్చాను.

మీరు ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి?

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అ!’ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్‌. దర్శకుడి క్రియేటివిటీ నచ్చింది. చాలా కొత్త తరహా చిత్రమది. ‘అ!’ తర్వాత ప్రశాంతంగా నాకు ఈ కథ చెప్పగానే… తప్పకుండా ఈ సినిమా చేయాలనుకున్నా. ‘క్షణం’ తర్వాత తెలుగులో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నా. నేను ఇంతకు ముందు చేసిన పాత్రల కంటే విభిన్నమైన పాత్రలు చేయాలని ఎదురు చూస్తున్నా. ‌ అప్పుడే ప్రశాంత్ వర్మ ఈ కథ చెప్పాడు. వెంటనే అంగీకరించా.

‘కల్కి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘కల్కి’లో నా క్యారెక్టర్ పేరు పద్మ. తను ఒక డాక్టర్. ఇప్పటివరకు నేను ఏ సినిమాలోనూ డాక్టర్ గా నటించలేదు. ఫస్ట్ టైమ్ డాక్టర్ క్యారెక్టర్ చేశా. పద్మ ఎక్కువగా మాట్లాడదు. మౌనంగా కళ్లతోనే తన భావాలను కనిపిస్తుంది‌. సాధారణంగా ‌మాటలతో కంటే కళ్ళతో నేను ఎక్కువ భావాలను పలికిస్తానని నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలకు రొమాన్స్ కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కౌగిలింతలు, ముద్దులు వంటివి లేవు. పాత కాలం సినిమాల్లో చూస్తే ఫిజికల్ రొమాన్స్ ఉండేదే కాదు ‌ డ్రామా లేదా ఓవరాక్షన్ కూడా ఉండవు. అటువంటి డిఫరెంట్ రోల్ ఈ సినిమాలో చేశా‌.

సినిమాలో మీ పాత్ర నిడివి తక్కువ‌. మీరేమంటారు?

ప్రతి సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పాత్రలో మనం ఏం చేయగలం అనేది చూడాలి. పాత్ర నిడివి ఎంత?
అని మాట్లాడుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. తెలుగులో నా తొలి సినిమా ‘హార్ట్ ఎటాక్’లో నా పాత్ర నిడివి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఏ సినిమా చేసినా అందరూ ఆ సినిమాలో పాత్ర నిడివితో పోలుస్తారు. ప్రచార చిత్రాలలో ‘కల్కి’ రాజశేఖర్ గారి చిత్రం అని స్పష్టం గా చూపించారు. ఇదొక డిఫరెంట్ థ్రిల్లర్. హిందీ లో నా తొలి సినిమా లో పాత్ర ‘హార్ట్ ఎటాక్’లో ఉన్నట్టు ఉండదు. డిఫరెంట్ క్యారెక్టర్. ప్రతీ క్యారెక్టర్ ని నేను డిఫరెంట్ గా చూస్తాను. నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి, ‘కల్కి’లో క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. బాబ్లీ, హ్యాపీ గా క్యారెక్టర్ కాదు అందుకని చేశా.

చారిత్రక చిత్రం కదా… మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?

చాలా రెట్రో ఫిలిమ్స్ చూశా. అప్పట్లో యాక్టర్స్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు చీర కట్టుకునే విధానం కానీ‌… నడిచే విధానం కానీ… కూర్చునే విధానం కానీ పేరు. వహీదా రెహమాన్ వంటి కథానాయికల్ని చూడండి. వల్ల బాడీ లాంగ్వేజ్ విలక్షణంగా ఉంటుంది. పాత సినిమాలు చూసి కొంత హోం వర్క్ చేశా‌. అలాగే, దర్శకుడు చెప్పిన సూచనలను పాటించాను.

రాజశేఖర్ గారితో నటించడం ఎలా ఉంది?

ఎంతో అనుభవంకల రాజశేఖర్ గారి పక్కన నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేశారు. ఎప్పుడు హుషారుగా ఉంటారు. ఆయన్ను ఆయన కొత్తగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వ్యక్తిలా చూస్తారు. నటన అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆయన్నుంచి నేనెంతో నేర్చుకున్నా.

ప్రస్తుతం ఏయే చిత్రాల్లో నటిస్తున్నారు?

హిందీలో ‘కమాండో 3’ చేస్తున్నా‌. ‘కమాండో 2’లో తెలుగమ్మాయి భావన రెడ్డి పాత్రలో నటించాను కదా.‌ ఈ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రంలోనూ అదే పాత్రలో కనిపిస్తా. హాలిడే అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. తన స్నేహితుల్లోని అబ్బాయిలు అందరితో కలిసి టూర్ కి వెళ్లే అమ్మాయిగా అందులో కనిపిస్తా. రొమాంటిక్ కామెడీ ‘మ్యాన్ టు మ్యాన్’లో లో మగవాడిగా కనిపిస్తా. మూడు భాషల్లో ఆ సినిమా విడుదల కానుంది. రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశా త్వరలో విడుదల కానున్నాయి‌. ‌ రీసెంట్ గా ఒక తెలుగు సినిమాకు సంతకం చేశా. సెప్టెంబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది. మంచి పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించడానికి నేను సిద్ధమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here