దివంగత నటులు మరియు రియల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ శ్రీహరి గారి తనయుడు మేఘంశ్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం రాజ్ దూత్. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకులు సంయుక్త దర్శకత్వం వహిస్తుండగా మేఘంశ్ సరసన నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో మేఘంశ్ ఎంతో అద్భుతంగా నటించాడని, తప్పకుండా తమ చిత్రం సక్సెస్ అవుతుందని చిత్ర బృందం ఆశాభావ్యక్తం చేస్తోంది.
ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి ఆదరణ లభించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ‘మనసున’ అనే పల్లవితో సాగె తొలి పాట మంచి సక్సెస్ అవడంతో, చిత్ర బృందం నేడు ‘చూస్తూనే ఉన్నా’ అనే పల్లవితో సాగె రెండవ పాటను యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో సుదర్శన్, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్ తదితరులు నటించగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి సంగీతం: వరుణ్ సునీల్ అందించడం జరిగింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


