యాంగ్రీ హీరో రాజశేఖర్ ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్ విడుదల….!!

0
106

టాలీవుడ్ లో యాంగ్రి హీరోగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్. ఇటీవల పి ఎస్ వి గరుడావెగ సినిమాతో తన సక్సెస్ ప్రయాణాన్ని మళ్ళి ప్రారంభించిన అయన, ప్రస్తుతం నటిస్తున్న కొత్త చిత్రం కల్కి. ఇటీవల ‘అ’ అనే వైవిద్యభరితమైన చిత్రంతో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది.  నేడు ఈ చిత్ర హానెస్ట్ ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేసారు చిత్ర బృందం.

చిత్రం ఆద్యంతం మంచి యాక్షన్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుందని ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. హై క్వాలిటీ విజువల్స్ తో  ఉత్కంఠ గా సాగే ట్రైలర్ లో చిత్ర కథాంశం గురించి రివీల్ చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా సాగే కల్కి ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఉండబోతోంది. రాజశేఖర్ సరసన ఆదా శర్మ, నందిత శ్వేతా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత సి కళ్యాణ్ హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా,కె కె రాధామోహన్ విడుదల చేస్తున్నారు.  దాశరధి శివేంద్ర కెమెరా మ్యాన్ గా, వణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా చిత్రాన్ని ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here