‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ తెలుగు ఛానల్….!!

0
101

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచి అయన కెరీర్లోనే అతిపెద్ద విజ్జయవంతమైన చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్ర విజయం ఇచ్చిన ఊపుతో త్వరలో సూపర్ స్టార్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ ను ప్రారంభించబోతున్నారు. ఒకప్పటి సీనియర్ నటి మరియు లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి రి ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ సరసన యంగ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జోడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.

ఇకపోతే నేడు ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఛానల్స్ లో ఒకటైన జెమినీ టీవీ భారీ ధరకు దక్కించుకున్నట్లు కాసేపటి క్రితం ఆ ఛానల్ వారు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్స్ ఈ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here