అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల అద్భుత విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ సంపాదించిన నటుడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం అయన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా, నటులు రాజశేఖర్ మరియు జీవిత గారి చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం దొరసాని. హృద్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్, మరియు ఒక పాట ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన రాబట్టిన విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్ర రెండవ పాటను విడుదల చేయబోతోంది చిత్ర యూనిట్.
ఇక నేడు తమ చిత్ర విశేషాల గురించి ఆనంద్ దేవరకొండ ఒక జాతీయ పత్రికతో పంచుకున్నారు. ఈ చిత్రం నటుడిగా తనకు మంచి పేరు వస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు ఆనంద్. అయితే అన్నయ్య విజయ్ దేవరకొండ, తన కోసం ఎప్పుడూ, ఎవరినీ ఒక్క అవకాశం ఇప్పించమని అడగలేదని, ఆ దేవుడి దయతో వచ్చిన ఈ మొదటి చిత్రం తప్పకుండా విజయవంతం అవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు ఆనంద్. ఇక కె.వి.ఆర్.మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు…!!


