యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం సాహో. ఇక అటు ప్రేక్షకులు, ఇటు రెబల్ స్టార్ అభిమానుల ఉత్సాహం మధ్య నిన్న విడుదలైన ఈ చిత్ర టీజర్ కు వీక్షకులు బ్రహ్మరథం పధాతున్నారు. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి దర్శకుడు సుజిత్, నేడు ఒక జాతీయ పత్రికతో తన అనుభవాలు పంచుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు ఇప్పుడో సూపర్ హీరో. ఆయన నాపై ఉంచిన నమ్మకమే నా ధైర్యం .నిజానికి ఈ కథను 2014 లో సిద్ధం చేసి, 2015లో ప్రభాస్ గారికి వినిపించడం జరిగిందని అన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందని అన్నారు. అయితే సినిమా తీయడానికి ఇంత సమయం పట్టడానికి కారణం, మధ్యలో ఒక్కొక్క షెడ్యూల్ కి కొంత ప్రిపరేషన్ అవసరమైనదని, అదీకాక అబుదాబిలో తాము తీసిన కీలక సన్నివేశాలకు 22 రోజులు సమయం పట్టిందని, రేపు సినిమా విడుదల తరువాత ప్రేక్షకులు ఆ సన్నివేశాలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఇకపోతే హీరోయిన్ గా ఇప్పటివరకు శ్రద్ధ గారు పోషించని వైవిధ్యమైన పాత్ర ఇందులో చేస్తున్నారని, నిర్మాతలు మొదటి నుండి ఎంతో సహకారం అందించడం వల్లనే తాను ఇంత పెద్ద ప్రాజక్ట్ చేయగలుగుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు..!!