డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా నాన్న‌గారు నాపై చాలా ప్ర‌భావం చూపారు – సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు

0
122

జూన్ 6న మూవీ మొఘ‌ల్ డి.రామానాయుడు జ‌యంతి. ఈయ‌న స్థాపించిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ఈ ఏడాదికి 55 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు ఇంట‌ర్వ్యూ…

ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నుండి …

– రేపు నాన్న‌గారి పుట్టిన‌రోజు.. అలాగే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి 55 ఏళ్లు అవుతుంది. 55 ఏళ్ల క్రితం ఓ రైతు (డి.రామానాయుడు) వ్యాపారం చేద్దామ‌ని చెన్నై వ‌చ్చారు. ఇటుక‌ల వ్యాపారం చేద్దామ‌ని అనుకున్నారు. అదేమో స‌రిగా న‌డ‌వ‌క‌లేదు. ఆ స‌మ‌యంలో ఎదురుగా ఉండే క్ల‌బ్‌కు వెళ్లారు. ఎవ‌రో సినిమా తీస్తున్నార‌ని తెలిసి, వారితో పార్ట్‌న‌ర్‌గా చేరారు. సైలెంట్ పార్ట్‌న‌ర్‌గా ఆయ‌న చేసిన సినిమాల‌తో పెట్టిన డ‌బ్బుల‌న్నీ పోయాయి. భ‌య‌ప‌డ‌కుండా మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకున్నారు. ఆరోజు ఆయ‌న ఆ కంటిన్యూగా సినిమాలు చేయాల‌నుకోవ‌డానికి కార‌ణం సినిమా ఇండ‌స్ట్రీలో కావాల్సినంత అవ‌కాశాలున్నాయి. ఉన్న‌వాళ్లు స‌రైన ప్లానింగ్ లేకుండా సినిమాలు చేస్తున్నారని అనుకోవ‌డ‌మే. అలా మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణంలో ఎన్నో గెలుపోట‌ముల‌ను చూశారు. నాకు, నా ఫ్యామిలీకి ఆయ‌న ప్ర‌యాణం ద్వారా తెలిసిన పాఠం ఏంటంటే అపజ‌యాల్లో అవ‌కాశాలుంటాయి. అస‌మ‌ర్ధ‌త‌లోనూ అవకాశాలుంటాయి. 16 ఏళ్ల పాటు ఆయ‌న క‌ష్ట‌ప‌డి మా బ్యాన‌ర్‌ను ఓ ద‌శ‌కు తీసుకొచ్చారు. 1980 త‌ర్వాత ఆయ‌న సినిమాల నిర్మాణానికే ప‌రిమితం కాకుండా సినిమాకు సంబంధించిన ఇత‌ర వ్యాపారాలైన ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ స్టార్ట్ చేశారు. త‌ర్వాత నేను వ‌చ్చాను. త‌ర్వాత డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిట‌ర్‌గా చేయ‌డం వంటి ప‌నులు చేశాను. నేనూ, వెంకీ ఉండ‌టం వ‌ల్ల కంపెనీ నిల‌బ‌డింది. మా నాన్న‌గారు చనిపోయిన త‌ర్వాత మేమందరం ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ చేయ‌డం నాకు ఆనందాన్ని క‌లిగించే విష‌యం. 55 ఏళ్లుగా ఓ ఫిలిం ప్రొడ‌క్ష‌న్ కంపెనీని ర‌న్ చేయ‌డం గొప్ప విష‌యం. మ‌రి కొన్నేళ్లు ఇక్క‌డే ఉంటే ఇంకా కొన్ని విషయాలను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌వ‌చ్చున‌నిపించింది. ఇప్పుడు ఇదే ప్రొడ‌క్ష‌న్ కంపెనీ కంటెంట్‌, టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఎదిగింది.

– మార్వ‌ల్ సినిమాటిక్స్‌, స్టార్ వార్ సినిమాటిక్స్ వ‌ర‌ల్డ్‌ను మ‌న మైథాల‌జీతో వేరే సినీ ఇండ‌స్ట్రీస్ క్రియేట్ చేశారో, మ‌న మైథాల‌జీతో మ‌నం ఇంకా పెద్ద స్థాయిలో చేయాల‌నుకుంటున్నాం. అమ‌ర‌చిత్ర క‌థ మ‌న‌కు కంటెంట్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ఒక‌ప్పుడు మ‌నం చేసిన మైథాల‌జీ సినిమాలు సినిమాలుగానే మిగిలిపోయాయి. వాటిని మిగిలిన ఏరియాస్‌లోకి తీసుకెళ్లలేక‌పోయాం. ఇదే కంటెంట్ అమెరికాలో ఉండుంటే పాతాళ‌భైర‌వి, మాయాబ‌జార్‌ థీమ్ పార్క్ వంటివి ఉండుండేవి. కానీ ఇప్పుడు ఇత‌ర ఏరియాస్‌లోకి మ‌న సినిమాల‌ను తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నాం. ఆర్టిఫిషీయ‌ల్ టెక్నాల‌జీనీ ఇక్క‌డ‌కు తీసుకొస్తున్నాం. వ‌ర్చువ‌ల్ రియాలిటీ అంశాల‌ను ఉప‌యోగించుకునే దిశ‌గా ప్లాన్స్ చేస్తున్నాం. మ‌న‌కు లిట‌రేచ‌ర్ ప‌రంగా కావాల్సినంత కంటెంట్ ఉంది. దానికి కావాల్సిన టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చేలా స‌న్నాహాలు చేస్తున్నాం.

– పాత రోజుల్లో ఫాలో అయ్యే కొన్ని ప‌ద్ధ‌తుల‌ను ఈవాళ ఎవ‌రూ ఫాలో కావ‌డం లేదు. ఫాలో అవుతున్న వారు ఎదుగుతున్నారు. ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో ప్రాసెస్ ఓ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో లేకుండా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ ప్రాసెస్‌ను వాళ్లు ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నారు. `యురి` వంటి సినిమాను 45 రోజుల్లో పూర్తి చేశారు. హాలీవుడ్‌లో అవెంజ‌ర్స్ సినిమాను 100 రోజుల్లో పూర్తి చేశారు. ఇలా చేయ‌డానికి కార‌ణం వారొక ప్రాసెస్‌ను ఫాలో కావ‌డ‌మే.

నాకు తెలిసింది కొంత మాత్ర‌మే..

– నిర్మాత‌గా నేను నేర్చుకుంది 65 శాతం మాత్ర‌మే ఉంటుంది. మిగిలిన 35 శాతాన్ని నేను శిక్ష‌ణ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు హిర‌ణ్య సినిమాకు మూడేళ్లుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్నాం. మాకు తెలియ‌ని చాలా విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రూ.5 కోట్ల సినిమా అయినా.. రూ.100 కోట్ల సినిమా అయినా, ఆ సినిమాకు ప‌నిచేసే టీంకు త‌గినంత ట్రెయినింగ్ ఉండాలి. అందుక‌ని మా ఫిలిం స్కూల్‌లో కూడా కొంత మంది మెంట‌ర్స్‌ను తీసుకొచ్చి వారికి శిక్ష‌ణ‌ను ఇప్పిస్తున్నాను. కేవ‌లం మా ఫిలిం స్కూల్ విద్యార్థుల‌కే కాదు.. ఇండ‌స్ట్రీలోని అంద‌రికీ ఫిలిం మేకింగ్‌లో శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్నాం.

సినిమా చూసే ప్రాసెస్ మారాలి..

– సినిమా థియేట‌ర్స్‌లో సినిమాలు చూసే విధానం మారాలి. కానీ వాటి ప్ర‌ద‌ర్శ‌న‌ స్టైల్ మార‌లేదు. ఇంకా 4 ఆట‌లే వేస్తున్నారు. మ‌నం హోట‌ల్స్‌లో తినే స్టైల్ మారింది. టీవీ స‌హా అన్నింటా మార్పు ఉంది కానీ.. థియేట‌ర్‌లో మార్పు లేదు. మ‌ల్టీప్లెక్ ఓ చేంజింగ్ ప్రాసెస్‌లా క‌న‌ప‌డుతుంది. ఫిలిమ్ మేకింగ్ ప్రాసెస్‌ను ఇంకా బెట‌ర్‌గా ఎలా చేయ‌వ‌చ్చు అనేది ఆలోచించాలి. ఉదాహ‌ర‌ణ‌కు జామ్ 8..సంగీత ద‌ర్శ‌కుల మార్కెట్ . బాలీవుడ్‌లో ప్రీత‌మ్ మ్యూజిక్ ప‌రంగా చేస్తున్న సిస్ట‌మ్‌ను మ‌నం ఇక్క‌డ అత‌ని స‌హ‌కారంతో చేయ‌బోతున్నాం. ఇప్పుడు ఫిలిం మేకింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఏదో షార్ట్ ఫిలిం చేస్తారు. ఎక్కువ లైక్స్ వ‌చేస్తున్నాయి. అలాంటి వారికి ఫిలిం మేకింగ్ ప్రాసెస్ గురించి తెలియ‌దు. అలాగ‌ని అంద‌రూ అలాగే ఉంటార‌ని కాదు. ఉదాహ‌ర‌ణ‌కు త‌రుణ్ భాస్క‌ర్ లాంటి ద‌ర్శ‌కుడు ప్రీ ప్రొడ‌క్ష‌న్ నుండి ఓ ప్రాసెస్‌ను ఫాలో అవుతారు. హాలీవుడ్ సినిమాల‌కు కాస్త అటో ఇటో టెక్నాల‌జీని మ‌న సినిమాల్లో ఉప‌యోగిస్తున్నాం. కానీ వారిలా సినిమాలు మ‌న‌మెందుకు చేయ‌లేక‌పోతున్నాం. మ‌నం ఓ ప్రాసెస్‌ను ఫాలో కావ‌డం లేదు.

ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు..

– ఇండియన్ మూవీస్‌లోనే భారీ చిత్రంగా హిర‌ణ్య సినిమాను చేయ‌బోతున్నాం. చిన్న క‌థ అయితే లో బ‌డ్జెట్‌లో పూర్తి చేస్తాం. పెద్ద బ‌డ్జెట్‌లో చేయాల్సి వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాం. తెలుగులో చాలా సినిమాలు చేయ‌బోతున్నాం. ఆ వివ‌రాల‌ను ఇప్పుడే చెప్ప‌లేను. కేవ‌లం తెలుగులోనే కాదు.. త‌మిళం స‌హా ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేయబోతున్నాం.

చాలా విలువ‌లు నేర్పారు..

– నాన్న‌గారు చాలా విష‌యాల‌ను నేర్పించారు. ఇండ‌స్ట్రీలోనే కాదు..ఎక్క‌డా శాశ్వ‌త‌మైన శ‌త్రువులు ఉండ‌కూడ‌దు. క్ష‌మించు.. మ‌ర‌చిపో. నీ గురించి ఎవ‌రు త‌ప్పుగా మాట్లాడినా నువ్వు పెద్ద‌గా స్పందించ‌కు అన్నారు. అలాగే బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న‌ప్పుడే సినిమాను స్టార్ట్ చేయాల‌నేది ఆయ‌న త‌త్వం. అలాగే కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. నాకు సినిమా గురించిన తెలిసిన విష‌యాలన్నీ నాన్న‌గారి వ‌ల్ల‌నే తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here