సుఖీభవ మూవీస్‌ బ్యానేర్ పై న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రం ఉల్లాలా..ఉల్లాలా

0
367

సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ నిర్మాత‌గా న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఉల్లాలా..ఉల్లాలా. ఈ చిత్రంలో న‌ట‌రాజ్ (స‌త్య‌ప్ర‌కాష్ కుమారుడు) నూరిన్ షెరీఫ్‌(లవర్స్ డే ఫేమ్), అంకిత మ‌హ‌రాణ( 4 లెటర్స్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ క్లాప్ కొట్ట‌గా, ఎస్‌.వి.కృష్ణారెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అశోక్‌కుమార్‌, బెన‌ర్జీ కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

సుఖీభవ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ మాట్లాడుతూ… ఈ సంవ‌త్స‌రంలో ఇది నా నాలుగ‌వ చిత్రం. నాకంటే ఫాస్ట్‌గా ఎవ‌రూ చెయ్య‌రేమో బ‌హుశా. నేను కూడా ఒక ప్రేక్ష‌కుడిలాగా న‌వ్వ‌ల‌ని ఈ క‌థ‌ని ఒప్పుకున్నాను. స‌త్య‌ప్ర‌కాష్ చెప్పిన స్క్రిప్ట్ చాలా బావుంది. ఉల్లాల ఉల్లాల ఈ సినిమాకి ఉద‌యం కొబ్బ‌రికాయ కొట్టాము, సాయంత్రం గుమ్మ‌డికాయ కొడతాం. ఈ రోజు ఓపెనింగ్‌తోనే క్లోజింగ్ కూడా అవుతుంది. ఇందులో న‌టించిన ఆర్టిస్ట్‌లంద‌రూ చాలా డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. మీఅంద‌రికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాము. క‌న్న‌డ‌లో రాక్‌లైన్ బ్యాన‌ర్‌లో న‌టించిన న‌టుడు నటరాజ్ . పొలిటిక‌ల్‌లో ఎంతో బిజిగా ఉన్నా మా కోసం ఈ చిత్రంలో న‌టించిన పృధ్వీగారికి అంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. స‌త్య‌ప్ర‌కాష్ కాన్సెప్ట్ చెప్పి ఆయ‌న మొద‌టి చిత్రం నాతో చెయ్య‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు” అన్నారు.

నటుడు పృధ్వీ మాట్లాడుతూ... స‌త్య‌ప్ర‌కాష్ నేను చెన్నై నుంచి అన్న‌ద‌మ్ముల్లాగా క‌లిసి ఉంటాం. స‌త్య‌ప్ర‌కాష్ సినిమాల్లో విల‌న్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాడు కాని నిజానికి చాలా మంచి వారు. న‌ట్ రాజ్ క‌న్న‌డ‌లో స‌క్సెస్‌ఫుల్ హీరో. ఆయ‌న‌కి అక్క‌డ చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారు. స్మైలింగ్ స్టార్ అనే పేరు కూడా ఉంది. ఇక జి.జెగారు చాలా మంచి కెమెరామెన్‌. గురురాజ్‌గారు చాలా మంచి వారు. మ‌మ్మ‌ల్ని సెట్స్‌లో చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది క‌లిగించ‌లేదు. స‌త్య‌ప్ర‌కాష్‌గారు కూడా ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆయ‌న‌కి హాట్సాఫ్‌.

హ‌రో నటరాజ్ మాట్లాడుతూ… ఇది తెలుగులో వ‌స్తున్న నా ఫ‌స్గ్ డెబ్యూ మూవీ. నాన్నే ఈ సినిమాకి డైరెక్ట‌ర్ అని నాకు ముందు తెలియ‌దు. షూట్‌కి వెళ్ళినా కూడా ఎప్పుడూ షూటింగ్‌లా అనిపించేది కాదు. అంద‌రం ఒక ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లాగా క‌లిసిపోయాం. ప్రొడ్యూస‌ర్ చాలా మంచి వారు ఆయ‌న గురించి మాట్లాడేంత పెద్ద‌వాడ్ని కాదు నేను. మా నాన్నే నాకు పెద్ద గురువు. ఆయ‌నే నా మెంట‌ర్ అనుకుంటాను అన్నారు.

హీరోయిన్ అంకిత మ‌హ‌రాణ మాట్లాడుతూ... నాకు ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్ ఉంది. మా చిత్ర యూనిట్ అంద‌రూ నాకు బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రం ఒక ఫ్యామిలీలాగా క‌లిసిపోయాం అన్నారు.

హీరోయిన్ నూరిన్ షరీఫ్ మాట్లాడుతూ... ముందుగా నాకు ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. మా డైరెక్ట‌ర్‌గారిని మొద‌టి సారి చూసిన‌ప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాను ఆయ‌న చాలా సీరియ‌స్ ప‌ర్స‌న్ అనుకున్నా కాని సెట్‌లో ఆయ‌న చాలా స‌ర‌దాగా ఉంటారు. ఏదైనా తెలియ‌క‌పోయినా చాలా మంచిగా చెప్పేవారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది ” అన్నారు.

చిత్ర దర్శకుడు స‌త్య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ… దాదాపుగా నేను అన్ని భాష‌ల్లో విల‌న్‌గా చేశాను. హాలీవుడ్‌లో కూడా చేశాను. యాక్టువ‌ల్‌గా స‌త్య‌ప్ర‌కాష్ అంటే ఎవ‌రికీ తెలియ‌దు. న‌న్ను అంద‌రూ విల‌న్ అనే పిలుస్తారు. నేను జ‌నానికి ఒక విల‌న్‌గానే తెలుసు. ఇంత‌కాలం స‌త్య‌ప్ర‌కాష్ ఇండ‌స్ట్రీలో ఉన్నాడంటే దానికి కార‌ణం జి.జె గారే ఆయ‌నే నాకు మొద‌టి సినిమా అవ‌కాశం క‌ల్పించారు. ఇక గురురాజ్‌గారు చాలా అద్భుత‌మైన వ్య‌క్తి. తెలుగు ఇండ‌స్ట్రీ ఉన్నంత కాలం గురురాజ్‌గారి పేరు వినిపిస్తుంది. ఇలాంటి ప్రొడ్యూస‌ర్ ఉండడం మ‌న తెలుగు ఇండ‌స్ట్రీ అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఆయ‌న‌కి అన్ని విష‌యాల్లోనూ అవ‌గాహ‌న ఉంది. ఇటు డైరెక్ష‌న్‌, కెమెరాప‌ని న‌టించ‌డం ఒక్క‌ట‌ని కాదు అన్నిరంగాల్లోనూ అనుభ‌వం ఉంది. అందువ‌ల్ల‌నే ఆయ‌న ఏదైన మార్పు చెప్పినా త‌ప్ప‌కుండా పాటిస్తాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here