చిత్రం, నువ్వు నేను, జయం, నేనే రాజు నేనే మంత్రి వంటి విభిన్న కథాంశంతో కూడిన సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ సాధించారు టాలెంటెడ్ డైరెక్టర్ తేజ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘సీత’. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది . ఈ సందర్భంగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ ఇంటర్వ్యూ…
సినిమా ముందు అనుకున్న డేట్ కి రాలేకపోవడానికి కారణం అవెంజర్స్ సినిమానా?
– అదేం కాదండి! ముందు అనుకున్న డేట్‌కి ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి. కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాం. తరువాత మళ్ళీ అందరం అనుకుని మే 24 అయితే బాగుంటుంది అని ఈ డేట్‌కి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నాకు కూడా సినిమాను ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఎడిట్ చేయడానికి తగిన సమయం కూడా దొరికింది.
సీత సినిమా చూసిన తరువాత చేయాల్సిన మార్పులు ఏమైనా గమనించారా?
– నా సినిమాలకు నేను ఎప్పుడూ మార్పులు గమనిస్తూనే ఉంటాను. ఈ మధ్యకాలంలో ‘చిత్రం’ సినిమా టెలివిజన్‌లో చూసి క్లైమాక్స్‌లో మార్పులు చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అలా ఒక్కటేమిటి నా అన్ని సినిమాలలో నాకు చాలా మార్పులు చేస్తే బాగుండు అనిపిస్తుంది.
రామాయణం ఇన్స్‌పిరేషన్‌తో ఈ కథ రాసుకున్నారా?
– రామాయణం ఇన్స్‌పిరేషన్ అంటూ ఏమి లేదు. అలాగని ఏ సినిమా స్టోరీని కాపీ చేయలేదు. డైలాగ్స్ వల్ల రామాయణానికి దగ్గరగా ఉంది అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకు రామాయణానికి సంబంధం లేదు. ‘సీత’ క్యారెక్టర్ ఇవ్వాళ ప్రపంచంలో ఉండే ధనదాహం కానీ.. చెడుని, చేసింగ్ ఫర్ ఫేమ్ అనే దానిని రిప్రజంట్ చేస్తుంది. న్యాయంగా పద్దితిగా నిజమే మాట్లాడాలి అనుకునేది రామ్ క్యారెక్టర్. ప్రపంచం ఎలా ఉండాలి అనడానికి రామ్, ఎలా ఉంది అనడానికి సీత ఉదాహరణ. వీళ్లిద్దరి మధ్య జరిగే సంఘర్షనే ఈ సినిమా.
సోనుసూద్ పోషించిన బసవ క్యారెక్టర్ రామాయణంలో రావణాసురుడిని పోలి ఉంది కదా?
– అలా ఏమి ఉండదు. రామాయణంలో రావణాసురుడు సీతని ఎత్తుకేళ్లాడు. లంకలో పెట్టాడు. కానీ ఇక్కడ బసవ ‘సీత’ తనకు తానే తన దగ్గరకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని షేడ్స్ కనిపించి ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్ రావణాసురుడులాగానో, హిరణ్యకశిపుడి లాగానో ఉంటుంది. మనం అలా పోల్చడం అలవాటు చేసుకున్నాం.
సీత సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది?
– ప్రస్తుతానికి చాలా బాగుంది. ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. నిన్న మార్నింగ్ జనాలు ఎక్కువగా ఎలక్షన్ మూడ్‌లో ఉన్నారు కానీ ఈవినింగ్ నుండి మరియు ఈ రోజు ఉదయం థియేటర్స్ అన్ని ఫుల్‌గా ఉన్నాయి.
http://industryhit.com/t/2019/05/director-teja-at-sita-inteview-pics/
సాయి పెర్ఫామెన్స్ గురించి?
– ఈ కథ రాసుకున్నప్పుడే ఒక స్ట్రాంగ్ మ్యాన్ కావలి అనుకున్నాను. అలాగే అతని మోహంలో అమాయకత్వం ఉండాలి అని సాయిని సెలెక్ట్ చేశాను, అతను కూడా అనుకున్న విధంగా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు.
సోనూసూద్ తనికెళ్ళ భరణి క్యారెక్టర్స్ బాగా హిలేరియస్‌గా ఉన్నాయి ! మీరు ముందే గెస్ చేశారా?
– అవును వర్కౌట్‌అవుద్ది అని నేను ముందే ఊహించాను. వాళ్లిద్దరి మధ్య వచ్చేడైలాగ్స్‌కి ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ వస్తోంది. లక్ష్మి భూపాల్ గారి డైలాగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
బౌండెడ్ స్క్రిప్ట్ తోనే షూట్‌కి వెళ్తారా?
– నేను బౌండెడ్ స్క్రిప్ట్ తోనే షూట్‌కి వెళ్తాను. అయితే కామెడీ సీన్లు మాత్రం స్పాట్ లోనే ఇంప్రవైజ్ చేస్తాను. అంతే తప్ప ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక మళ్ళీ క్యారెక్టర్‌ను మార్చను. ఎందుకంటే దానివల్ల అసలు కథే ప్రమాదం లో పడొచ్చు..
ఈ సినిమాలో కాజల్, సోనూసూద్ మీ ఛాయిస్సేనా?
– కాజల్ నా ఛాయిస్. ఈ కథ అనుకున్నప్పుడే కాజల్ అనుకోని రాసాను. ఇక సోనూసూద్ వచ్చేసి నిర్మాత అనిల్‌సుంకర ఛాయిస్. ఆయనైతే కరెక్ట్‌గా న్యాయం చేయగలడని అన్నారు. అందులోను ఆయనతో ‘దూకుడు’ సినిమా చేసి ఉన్నారు. అందుకే అతన్నే ఫైనల్ చేయడం జరిగింది. చాలా బాగా చేసాడు.
మీ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది?
– నా నెక్స్ట్ సినిమా అనేది ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి ఉంటుంది. ఆడియన్స్ నాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. కానీ భారీ బడ్జెట్‌లో మాత్రం ఉండదు. కథకు తగ్గట్టే బడ్జెట్ ఉంటుంది తప్ప అనవసరమైన ఖర్చు ఉండదు.
ఈ తరం యంగ్ డైరెక్టర్స్‌కి మీ మెసేజ్?
– ఎప్పుడూ కొత్తదనం కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ఇంకా ఇండస్ట్రీలోకి రావాలి. చిన్న సినిమాలు ఎక్కువ విడుదలవ్వాలి. భారీ బడ్జెట్ సినిమాల ద్వారా కొత్త డైరెక్టర్స్ రాలేరు. చిన్న సినిమా విజయం సాధించడం వల్లే అది సాధ్యం అవుతుంది. అలాగే చిన్న సినిమాలకు థియేటర్స్ కూడా ఇవ్వాలి అప్పుడే ఆ టాలెంట్‌ని మనం గుర్తించగలం. అంటూ ఇంటర్వ్యూ ముగించారు టాలెంటెడ్ డైరెక్టర్ తేజ.


