హీరో అల్లరి నరేష్ కు కొంతకాలంగా ఎన్ని కథలు మార్చి తీసినా ఆశించిన ఫలితాలు లేవు.. అందుకే మంచి కథ ఉంటేనే చేస్తానని ఊరుకున్నాడు. అలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాజాగా మహేష్ బాబు ‘మహర్షి’లో ఓ కీలక పాత్రను పోషించాడు. ఈ మూవీలో మహేష్ బాబు స్నేహితుడి పాత్రకు జీవం పోశాడు. గ్రాండ్ హిట్ అందుకున్నాడు.
నరేష్ రోల్ మహర్షి సినిమాలోనే ఒక హైలెట్ గా నిలిచిపోయింది. ఈ సినిమాకు ముందు నరేష్ వేరు.. ఇప్పుడు నరేష్ వేరు.. అల్లరి నరేష్ దశ మహర్షి సినిమాతో మారిపోయింది. ఇక మహేశ్ బాబు సినిమా తర్వాత నరేష్ సోలో హీరోగా మళ్లీ కనిపించబోతున్నాడు. కాకపోతే ఈసారి రోటీన్ కామెడీ కథతో కాకుండా ‘క్రైం’ హర్రర్ కథను నమ్ముకున్నాడు.
యముడికి మొగుడు, జంప్ జిలానీ, బెట్టింగ్ బంగార్రాజు లాంటి సినిమాలను నరేష్ తో చేసిన సత్తిబాబు దర్శకత్వంలో ఓ క్రైం మూవీ చేయబోతున్నాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి కథ, డైలాగులు విక్రమ్ రాజ్ అందిస్తున్నాడు. లక్ష్య ప్రొడక్షన్ వారు ఈ కామెడీ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారట.. చిత్రాన్ని మేనెలాఖరులో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మహర్షి సినిమా నరేష్ సినీ జీవితాన్నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 4 ఏళ్లుగా హిట్ లేక బాధపడుతున్న నరేష్ కు హిట్ మహిమ ఏంటో తెలిపింది. నిజంగా మహర్షి మూవీ తనకు పునర్జన్మ అని ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ చెబుతున్నాడు. ఈ మూవీ నరేష్ కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.


