మహర్షి.. ది జర్నీ ఆఫ్ రిషి.. ఇప్పుడు ఈ రిషీ జర్నీలోకి విక్టరీ వెంకటేష్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా జాయిన్ అవ్వబోతున్నారు..
మహర్షి ప్రీ రిలీజ్ వేడుక మే 1న ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగబోతోంది. ‘భరత్ అనేనేను’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ ‘మహర్షి’ కోసం మూడు భిన్నమైన కోణాలున్న పాత్రలో మెప్పించనున్నారు. దర్శకుడు వంశీ ఈ సినిమా కోసం మూడేళ్లుగా కష్టపడి సినిమాను రిలీజ్ ముంగిట నిలిపారు.
ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న టైం రానేవచ్చింది. మే1 మహర్షి ప్రి రిలీజ్ వేడుక. మే 9న సినిమా విడుదల. సినిమాకు ప్రి రిలీజ్ వేడుకనే ప్రధాన ఆకర్షణ. ఈ వేడుకతోనే సినిమాపై అంచనాలు మరింత పెంచవచ్చు. ఈ సినిమా వేడుకకు అగ్రహీరో వెంకటేశ్ ను, రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఆహ్వానించారు.
అగ్రహీరో వెంకీ, యంగ్ హీరో విజయ్ మధ్యలో సూపర్ స్టార్ మహేష్ చేసే సందడి ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు రెడీ అయ్యారు. మరి ఈ ప్రతిష్టాత్మక పండుగ ఎంతటి సంచలనాలకు వేదికవుతుందో చూడాలి మరీ..


