ఫోటో స్టొరీ: బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్

0
396

బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. దాదాపు టాప్ లీగ్ స్టార్ హీరోలందరితో నటించింది కాబట్టి భారీ గుర్తింపే సాధించింది. రకుల్ కు గత ఏడాది అంతకు ముందు ఏడాది టాలీవుడ్ లో పెద్దగా కలిసిరాలేదు. అయితే ఇప్పుడు మాత్రం క్రేజీ ప్రాజెక్టులనే లైన్లో పెట్టింది. నాగార్జున ‘మన్మథుడు 2’ లో ఈ భామే హీరోయిన్. ఇక హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘దే దే ప్యార్ దే’ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 17 న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది రకుల్. ఈ ప్రమోషన్ కోసమే చక్కగా తయారై ఆ ఫోటోలను తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఈ ఫోటోలకు “నలుపు రంగు ఎప్పుడూ మనలను నిరాశ పరచదు” అన్నట్టుగా ఇంగ్లీష్ లో క్యాప్షన్ ఇచ్చింది. ‘దే దే ప్యార్ దే’ ప్రమోషన్స్ కోసం ఈ డ్రెస్ ధరించానని వెల్లడించింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టాప్.. అదే రంగులో లూజ్ గా ఉన్న బ్లాక్ ప్యాంట్ ధరించింది. ఆఖరికి బెల్ట్.. చెప్పులు కూడా నలుపు రంగే. ఇయర్ రింగ్స్ మాత్రం తెలుపు రంగులో ఉన్నాయి. లూజ్ హెయిర్ తో.. పర్ఫెక్ట్ మేకప్ తో అల్ట్రా స్టైలిష్ మోడల్ లాగా గోడకు అనుకుని నిలబడింది.

అసలే రెగ్యులర్ గా ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్నెస్ మెయింటెయిన్ చేసే భామ కావడంతో స్లిమ్ గా.. ఇంటర్నేషనల్ మోడల్ లాగా ఉంది. ఎడమ చేతిని ప్యాండ్ జేబులో పెట్టుకొని యమా స్టైలిష్ గా ఉంది. బాడీ లాంగ్వేజ్.. యాటిట్యూడ్ కూల్ గా ఉండడంతో ఈ ఫోటోలను పోస్ట్ చేసిన ఒక గంటలోపే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. గార్జియస్.. ఝకాస్.. లేడీ ఆన్ ఫైర్ అని చాలామంది నెటిజనులు పొగుడుతూ కామెంట్స్ పెట్టారు. ఒకరు బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అని కలర్ ను కూడా మెచ్చుకున్నాడు. కానీ ఒక నెటిజనుడికి ఈ స్లిమ్ అవతారం నచ్చలేదేమో.. రకుల్ బక్కగా ఉందని అనిపించిందేమో కానీ “కొంచెం మీ అడ్రెస్ మెసేజ్ చెయ్యండి. జొమాటో లో ఫుడ్ ఆర్డర్ పెడతాం తినండి” అంటూ ఓ ఆఫర్ ఇచ్చాడు. ‘లోకో భిన్న రుచి’ అని ఊరికే అనరు కదా.. ఒక్కొకరి టేస్ట్ ఒక్కొరకంగా ఉంటుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here