మే 1.. సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రోజు.. ఆ రోజే మహేష్ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ వేడుకలో పాల్గొనడానికి అభిమానులు సిద్ధమవుతుండగా.. మహర్షి డైరెక్టర్ వంశీ తాజాగా అభిమానులకు మరో బోనస్ ఇచ్చాడు.
ఇప్పటికే మహేష్ మహర్షి మూవీలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా దర్శకుడు వంశీ ఫిర్ షురూ అనే పాటను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.బెన్నీ దయాల్ పాడిన ఈ పాటను శ్రీమణి రాశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ‘ఫిర్ షురూ’ పాటతో మొత్తం ఆరు పాటలు కూడా మహర్షి నుంచి విడుదలైనట్టు లెక్క.
దర్శకుడు వంశీ పైడిపల్లి ‘ఫిర్ షూరు’ పాటతో పాటు మొత్తం మహర్షి పాటలను జ్యూక్ బ్యాక్స్ గా యూట్యూబ్ లో ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. స్నేహం, ప్రేమ, గ్రామ సమస్యలు, రైతుల కష్టాలు, ఇలా విభిన్న కోణాల్లో రూపొందించిన మొత్తం పాటలు సినిమాకు హైలెట్ గా ఉంటాయని.. ఆరవ పాట మొత్తం యువత, సామాజిక అవగాహన పెంపొందించేలా ఉంటుందని దర్శకుడు వంశీ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు డీఎస్పీ మహేష్ బాబు సినిమా కోసం రూపొందించిన ఈ పాటలు ఇప్పటికే జనబాహుళ్యంలో మంచి స్పందన వస్తోంది.
మే 1న మహర్షి ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ఈ పాటలను మరోసారి వినిపించనున్నారు. సూపర్ స్టార్ అభిమానులందరూ ఇప్పటికే వేడుకకు హాజరయ్యేందుకు.. టీవీల్లో చూసేందుకు ఆసక్తితో ఉన్నారు.ఈ ఆసక్తిని మరింత పెంచేలా తాజాగా మహేష్ బాబు గాజు గ్లాస్ లో చాయ్ తాగుతున్న ఫొటోను చిత్రంయూనిట్ రిలీజ్ చేసింది. దీంతో అంచనాలు మరోసారి పెరిగిపోయాయి.


