రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంచన3’. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బేనర్‌పై రాఘవ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్ మూవీ మేకర్స్ బేనర్‌పై అభిరుచి గల నిర్మాత ఠాగూర్ మధు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 19న రిలీజైన ఈ సినిమా డబుల్ మాస్ హిట్‌గా నిలిచి అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో ఏప్రిల్ 24న ‘గ్రాండ్ సక్సెస్‌మీట్’ని నిర్వహించింది.
ప్రముఖ నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – ”కాంచన3′ ఏప్రిల్ 19న రిలీజై అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర, తెలంగాణలతో పాటు వరల్డ్‌వైడ్‌గా చాలా పెద్ద హిట్ అయ్యింది. ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’ సూపర్‌హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ‘కాంచన3’ అంతకన్నా పెద్ద హిట్ అయ్యింది. ఒక డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత మెయిన్ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, నెంబర్‌వన్ డ్యాన్స్ మాస్టర్‌గా, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అన్ని విభాగాల్లో సక్సెస్ అయ్యి చాలా పెద్ద రేంజ్‌కి వెళ్ళారు లారెన్స్. అలా ఎదుగుతూ ఎన్నో మంచి పనులు చేస్తూ.. రియల్ లైఫ్‌లో కూడా హీరోగా ఎదిగారు. ఆయన చేసిన మంచి పనులే ఆయన సినిమాలకు కథలు. హ్యాండీకాప్డ్ పిల్లల్ని ఆదరించి, వాళ్లకు చదువు చెప్పించి మంచి లైఫ్‌ని ఇచ్చారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదుకున్నారు. లారెన్స్‌ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే.. రియల్ లైఫ్‌లో అవన్నీ చేస్తారు. అందుకనే ఈ సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇంకా పెద్ద సక్సెస్ అవుతుంది. ‘కాంచన’ పది సిరీస్‌లు రావాలి. అన్నీ సూపర్‌హిట్స్ అవ్వాలి. అలాగే నిర్మాత ఠాగూర్ మధు ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. ఆయనకి ఈ సినిమా ద్వారా మరింత మంచి పేరు రావడం చాలా సంతోషం. త్వరలో రాబోయే ‘అర్జున్ సురవరం’, ‘అయోగ్య’ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించాలి” అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్‌చౌదరి మాట్లాడుతూ – ”కాంచన3′ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. లారెన్స్‌గారు ఇలాగే మరిన్ని మంచి సినిమాలు తీయాలి. తెలుగులో స్ట్రెయిట్ సినిమా చెయ్యాలి. అలాగే ఠాగూర్ మధుగారు వరుస హిట్స్ సాధించనున్నారు” అన్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వీర్నినాయుడు మాట్లాడుతూ – ”మంచి సినిమా నిర్మించి, మాకు పంపిణీ చేసే అవకాశాన్ని కల్పించిన లారెన్స్ మాస్టర్‌కి ధన్యవాదాలు. అలాగే నిర్మాత మధుగారికి ధన్యవాదాలు” అన్నారు.
అభిరుచిగల నిర్మాత ఠాగూర్ మధు మాట్లాడుతూ – ”కాంచన3′ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. లారెన్స్‌గారు ఓ చిన్న క్రైసిస్‌లో చాలా బాగా హెల్ప్ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్. ‘కాంచన3’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 75 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రెండు, మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసి, ‘కాంచన2’ కలెక్షన్స్ దాటబోతోంది. ఇంతటి ఘన విజయానికి కారణమైన మా ‘కాంచన3’ టీమ్‌తో పాటు, మాకు సహకరిస్తున్న మీడియాకి ధన్యవాదాలు” అన్నారు.
హీరోయిన్ వేదిక మాట్లాడుతూ – ”కాంచన3′ ఇంత మంచి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్‌కి థాంక్స్. ఇంతటి మంచి సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు డైరెక్టర్ లారెన్స్, నిర్మాతగారికి థాంక్స్. నేను ముంబాయిలో మా అమ్మగారితో కలిసి ప్రేక్షకుల మధ్య సినిమా చూశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ప్రేక్షకులు బాగా ఎంటర్‌టైన్ అవుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఫుల్ పైసా వసూల్. రిలీజైన అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో భారీ పబ్లిసిటీ చేసి, గ్రాండ్ స్కేల్‌లో సినిమాని రిలీజ్ చేసి వామ్ వెల్‌కమ్ ఇచ్చిన ఠాగూర్ మధుగారికి ధన్యవాదాలు. గెస్ట్‌లందరికీ థాంక్స్. చూడనివారందరూ థియేటర్‌కి వెళ్ళి సినిమా చూడండి” అన్నారు.
http://industryhit.com/t/2019/04/kanchana-3-success-meet-pics/
నటుడు, దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ – ”ముఖ్యంగా ఈ సినిమాని బ్లాక్ బస్టర్‌ని చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఆడియన్స్‌కి నచ్చుద్దా? లేదా? అని నేను 100 సార్లు చూసుంటాను. అలాగే ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాలు కష్టపడ్డాను. సినిమా చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీ. మధుగారు చాలా మంచి మనిషి. ఆయన ఇంకా పెద్ద హిట్స్ కొట్టాలి. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చినందుకు సంతోషం. రాబోయే సినిమాలన్నీ మంచి హిట్స్ అవ్వాలి. వేదిక సినిమాలో డ్యాన్స్‌లు, కామెడీ బాగా చేసింది. ఆమెకు మరిన్ని ఆఫర్లు రావాలని రాఘవేంద్రస్వామిని కోరుకుంటున్నా. నిక్కీ తంబోలా ఆల్‌రెడీ ఒక సినిమా పెద్ద హిట్ అయ్యింది. రెండో సినిమా ‘కాంచన3’ కూడా పెద్ద హిట్ అయ్యింది. లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెకి కూడా మంచి ఆఫర్లు రావాలి. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. డబ్బింగ్ స్ట్రెయిట్ సినిమాలా చాలా బాగా చెప్పారు. అలాగే నిన్న నేను ‘జెర్సీ’ సినిమా చూశాను. చాలా బాగుంది. అందరూ చూడండి. హీరో, దర్శకుడు చాలా బాగా చేశారు. ఈ రెండూ సినిమాలు బాగా ఆడాలి” అన్నారు.
హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ – ”తెలుగులో నాకు ఇది రెండో సినిమా. నేను ఈ స్టేజీ మీద నిలబడటానికి కారణమైన లారెన్స్‌గారికి థాంక్స్. సినిమాని హిట్ చేసిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే లభించాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఈ సక్సెస్‌మీట్‌లో విలేకరుల అడిగిన పలు ప్రశ్నలకు లారెన్స్ సమాధానాలు ఇచ్చారు.
‘కాంచన3’తో డబుల్ మాస్ హిట్ కొట్టారు కదా? ‘కాంచన4’ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
– డిస్ట్రిబ్యూటర్స్‌కానీ, నిర్మాతలతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇమీడియెట్‌గా ‘కాంచన4’ స్టార్ట్ చేయమని చెబుతున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే మెయిన్ పాయింట్ కోసం రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో మిగతావారికి అన్నం పెడితే దేవుడు మనకి అన్నం పెడతాడని చాలా స్ట్రాంగ్‌గా చెప్పాం. ఇంతకు ముందు హిజ్రాల గురించి, దానికి ముందు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ గురించి చెప్పాం. అలాంటి ఒక మంచి పాయింట్ దొరికితే త్వరగా స్టార్ట్ చేయాలని నాక్కూడా ఉంది.
ట్రస్ట్ గురించి చెప్పండి?
– ట్రస్ట్ బాగా నడుస్తోంది. హైదరాబాద్‌లో స్టార్ట్ చేయడానికి అన్నయ్య చిరంజీవిగారు 10 లక్షలు సహాయం చేశారు. ఈ సినిమా నుండి 50 లక్షలు ఇచ్చాను. ఈ సినిమా పబ్లిసిటీలో బిజీగా ఉన్నాం. త్వరలో ‘కాంచన’ హిందీ రీమేక్‌ని హీరో అక్షయ్‌కుమార్‌తో చేస్తున్నాను. రెండు వారాలు షూటింగ్ అయిపోగానే నా ట్రస్ట్‌కి సహాయం కోసం వచ్చిన వారిని నేనే స్వయంగా కలుసుకొని వారికి తగిన సహాయం చేస్తాను.
‘కాంచన3’ 100 కోట్లు సినిమా అవుతుంది కదా! ఎలా అన్పిస్తోంది?
– ‘కాంచన2’ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పటి నుండి ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు కాంచన 3 10 రోజుల్లోనే 100 కోట్లు పైగా కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది. దీనికంతటికి కారణం మా అమ్మ ఆశీర్వాదం, ఆ రాఘవేంద్ర స్వామి దయ.